ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

11ఏళ్లకే 19 పతకాలు - కరాటేలో సత్తా చాటుతున్న తణుకు చిన్నారి - TANUKU KARATE GIRL

Tanuku Girl Excelling in Karate : 11 ఏళ్ల ప్రాయంలోనే కరాటేలో అద్భుత ప్రతిభ కనబరుస్తూ ఔరా అనిపిస్తోంది ఆ బాలిక. జిల్లా, రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సైతం సత్తా చాటుతూ పతకాలు సాధిస్తోంది. ఆ చిన్నారే పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన సౌమ్య శ్రీ వైష్ణవి.

Tanuku Girl Excelling in Karate
Tanuku Girl Excelling in Karate (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 30, 2024, 3:46 PM IST

Vaishnavi in Karate : అమ్మాయిలూ ఆత్మరక్షణ కోసం కరాటే విద్యవైపు వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా తండ్రి ప్రోత్సాహంతో తణుకుకు చెందిన వైష్ణవి కరాటే శిక్షణలో చేరింది. పవర్‌ఫుల్‌ పంచులతో, డిఫెన్స్‌ టెక్నిక్స్‌తో అదరగొడుతోంది. అలా ఆ అమ్మాయి పంచ్‌ పడిందంటే ప్రత్యర్థులు చిత్తు కావాల్సిందే! పతకాల పంట పండాల్సిందే.

బంగారు పతకం కైవసం : వైష్ణవి తండ్రి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడు కాగా, తల్లి నాగలక్ష్మి గృహిణి. వైష్ణవి తణుకులోని ఒక ప్రైవేట్​ పాఠశాలలో ఆరోతరగతి చదువుతోంది. తండ్రి సూచనలతో ఎనిమిదో ఏట కరాటే క్లాసుల్లో చేరింది. అనతికాలంలోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మొత్తం 19 పతకాలు సాధించింది. ఇటీవల నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ కరాటే పోటీల్లో బంగారు పతకం కైవసం చేసుకుంది. లఖ్‌నవూ, వారణాసిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రజత పతకాలు సాధించింది.

"నేను ఆత్మరక్షణకోసం కరాటే నేర్చుకుంటున్నాను. శ్రీనివాస్​ సార్ దగ్గర కరాటే సాధన చేస్తున్నాను. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. నేపాల్​లో జరిగిన ఇంటర్నేషనల్‌ పోటీల్లో బంగారు పతకం సాధించాను. మా తల్లిదండ్రులు, మా గురువులు, మా పెద్దమ్మ, పెద్దనాన్న నన్ను ఎంతో ప్రోత్సహించారు. భవిష్యత్​లో మరిన్ని పతకాలు సాధించాలనే పట్టుదలతో సాధన చేస్తున్నాను."- సౌమ్య శ్రీ వైష్ణవి, కరాటే క్రీడాకారిణి

"ప్రస్తుతం రోజుల్లో అమ్మాయిలపై అఘాయ్యితాలు పెరిగిపోయాయి. అందుకే మా పాపకు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పించాను. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. నేపాల్​లో జరిగిన పోటీల్లో బంగారు పతకం సాధించింది. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది." - పోతరాజు, వైష్ణవి తండ్రి

తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆత్మరక్షణ కోసం కరాటే నేర్చుకున్నట్లు వైష్ణవి తెలిపింది. భవిష్యత్​లో మరిన్ని పోటీల్లో పాల్గొని పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితులలో తమ పిల్లలు ఆత్మరక్షణ కోసం కరాటే నేర్పిస్తున్నట్లు బాలిక తండ్రి పోతరాజు చెప్పారు. కరాటేలో వైష్ణవి మంచి ప్రతిభ చూపిస్తోందని ఆమె గురువు శ్రీనివాస్ తెలిపారు. ఇలాగే దూకుడు కొనసాగిస్తే భవిష్యత్​లో అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించగలదని పేర్కొన్నారు. అందుకు అవసరమైన శిక్షణ ఇస్తున్నట్లు శ్రీనివాస్​ వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని పతకాలు సాధించాలని కోరుకుంటున్న ఆ చిన్నారి కలలు నెరవేరాలని ఆకాంక్షిద్దాం.

కరాటేలో బెజవాడ కుర్రాడి సత్తా - అంతర్జాతీయంగా 6 స్వర్ణ పతకాలు కైవసం - Ranadhir Excelling in Karate

చిన్న వయస్సులోనే 15స్వర్ణ పతకాలు- జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో బహుముఖ ప్రజ్ఞ - Multi Talented Girl

ABOUT THE AUTHOR

...view details