తెలంగాణ

telangana

ETV Bharat / state

ఠాగూర్​ మూవీ సీన్​ రిపీట్ - డబ్బు కోసం జూనియర్ డాక్టర్​ డెడ్​బాడీకి ట్రీట్​మెంట్!

సినిమాలోని సీన్​ను తలపిస్తున్న మెడికవర్​ ఆసుపత్రి నిర్వాకం - రోగి మృతి చెందిన విషయం చెప్పని డాక్టర్లు - డబ్బులు చెల్లించిన తర్వాత చనిపోయిందని చెప్పారని బంధువల ఆరోపణలు

TAGORE MOVIE SCENE REPEATE
MEDICOVER HOSPITAL IN MADHAPUR (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Medicover Hospital in Hyderabad : హైదరాబాద్​ మాదాపూర్‌‌లోని మెడికవర్​ ఆసుపత్రిలో ఠాగూర్​ సినిమాలోని హాస్పిటల్ సీన్ రిపీట్ అయింది. రోగి మృతి చెందినా చికిత్స చేస్తున్నామంటూ ఆసుపత్రి యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. రోగి చికిత్స కోసం అప్పటికే రూ.7 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. అయితే మరో రూ. 3 లక్షల 80 వేలను చెల్లించాలని లేకపోతే వారి కుమార్తెకు చికిత్స ఆపేస్తామని డాక్టర్లు ఒత్తిడి చేసినట్లు తెలిసింది.

బాధితుల వివరాల ప్రకారంజూనియర్‌ డాక్టర్‌ నాగప్రియ అనే యువతి అనారోగ్యానికి గురైంది. కాగా చికిత్స కోసం కొన్ని రోజుల క్రితం మాదాపూర్​లోని మెడికవర్​ ఆసుపత్రిలో చేరింది. మంగళవారం రాత్రి (నవంబర్ 05)న చికిత్స అందిస్తుండగా ఆమె మృతి చెందింది. కానీ ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆసుపత్రి యాజమాన్యం దాచిపెట్టిందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ట్రీట్‌మెంట్‌ కొనసాగించాలంటే బిల్లు కట్టాలని, లేకపోతే చికిత్స ఆపేస్తామని డాక్టర్లు చెప్పారని అన్నారు.

అప్పటికే కొన్ని లక్షలు చెల్లించామని.. ఎంతో కష్టపడి ఇవాళ (నవంబరు 6వ తేదీ) ఉదయం మరో రూ.లక్ష చెల్లించామని తెలిపారు. ట్రీట్​మెంట్​ కోసం ఫీజు చెల్లించిన తర్వాత తమ కుమార్తె మరణించిందని చెప్పారని వాపోయారు. చివరకు డబ్బు కట్టిన తర్వాతే తమ కుమార్తె మృతదేహాన్ని అప్పగించారని ఆందోళనకు దిగారు. డబ్బు కోసమే తమ కుమార్తె మృతి చెందిన వార్తను వైద్యులు దాచిపెట్టారంటూ ఆరోపించారు. వెంటనే ఆసుపత్రి ఆవరణలో ధర్నా చేపట్టారు. బాధితురాలు వెంటిలెటర్​పై చికిత్స పొందుతూనే తమ హాస్పిటల్​ చేరినట్లు ఆస్పత్రి యాజమాన్యం వివరణ ఇచ్చింది. ఈ విషయంలో తమ వైద్యులు ఎక్కడా నిర్లక్ష్యం వహించలేదని .

గాంధీ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత - బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు అరెస్టు - police arrest brs leaders

రజనీకాంత్ హెల్త్ అప్డేట్- ఆసుపత్రి నుంచి తలైవా డిశ్చార్జి - Rajinikanth Health Update

ABOUT THE AUTHOR

...view details