ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు- సముద్ర ఈతలో రికార్డు దిశగా గోలి శ్యామల - VIZAG TO KAKINADA SWIMMING EVENT

విశాఖ ఆర్కే బీచ్​లో కోరమాండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ ఆధ్వర్యంలో కార్యక్రమం- విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈత కొట్టనున్న స్విమ్మర్ గోలి శ్యామల

Goli Shyamala will swim 150 km
Goli Shyamala will swim 150 km (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2024, 5:25 PM IST

Updated : Dec 29, 2024, 6:51 PM IST

Goli Shyamala Story:ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదని నిరూపించింది ఆమె. చెరువులు, నదుల్లో దిగటం మాత్రమే తెలిసిన ఆమె నలభై ఏడేళ్ల వయసులో శ్రీలంక జలసంధిని అవలీలగా ఈదేశారు. ఈ ఏడాది మార్చిలో పాక్‌జలసంధి 30 కి.మీ దూరాన్ని 13 గంటల 43 నిమిషాల్లో ఈదిన తెలంగాణ తొలి మహిళగా ఘనతను సాధించారు. ఆమె ఎవరో కాదు మన తెలుగు తేజం. పేరు గోలి శ్యామల. తాజాగా ఎంతో క్లిష్టమైన కాటలినా ఛానల్‌ను 10 గంటల 4 నమిషాల 45 సెకన్ల పాటు ఏకబిగిన ఈతకొట్టి మరో రికార్డు ఖాతాలో వేసుకున్నారు. శ్యామల విజయయాత్ర అక్కడితో ఆగకుండా విశాఖ ఆర్కే బీచ్​లో జరగనున్న స్విమ్మింగ్ కార్యక్రమంలో ఏకంగా 150 కిలోమీటర్ల దూరాన్ని ఈదేందుకు శ్రీకారం చుట్టారు.

యువతరానికి ఈమె ఆదర్శం:ఎంపీ శ్రీ భరత్ విశాఖకు చెందిన కోరమాండల్ ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ ఆధ్వర్యంలో గోలి శ్యామల విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈత కొట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ స్విమ్మింగ్ కార్యక్రమాన్ని ఎంపీ శ్రీభరత్ విశాఖ ఆర్కే బీచ్ లో ప్రారంభించారు. "150 కిలోమీటర్ల దూరాన్ని శ్యామల ఈదుతారు. గతంలో ఈమె కన్యాకుమారి నుంచి శ్రీలంకకు సముద్రంలో ఈదుకుంటూ వెళ్లారు.ఐదు పదుల వయసు పైబడిన శ్యామల మహిళా స్థిరమైన శక్తికి ఒక ఉదాహరణ" అంటూ ఎంపీ శ్రీ భరత్ అభివర్ణించారు. ఈ వయసులోనూ ఈత నేర్చుకొని సముద్రాన్ని ఈదడం ఆమె లక్ష్య స్థిరత్వానికి ఉదాహరణగా ఉంటుందని చెప్పారు. యువతరానికి ఈమె ఆదర్శంగా ఉంటారన్నారు. నిత్యం చైతన్యవంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తానని గతంలో తనను హేళన చేసిన వారే ఇప్పుడు మెచ్చుకోవడం జరుగుతుందని గోలి శ్యామల అన్నారు.

Last Updated : Dec 29, 2024, 6:51 PM IST

ABOUT THE AUTHOR

...view details