ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు - SUPREME COURT NOTICES TO YS AVINASH

అవినాష్‌ బెయిల్‌ రద్దు చేయాలని సునీత వేసిన పిటిషన్‌పై విచారణ - కేసు దర్యాప్తులో అవినాష్‌రెడ్డి కీలకమైన వ్యక్తి అన్న సిద్ధార్థలూథ్రా

Notices_to_YS_Avinash_Reddy
Supreme Court Notices to YS Avinash Reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 3:25 PM IST

Supreme Court Notices to YS Avinash Reddy: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కొడుకు చైతన్యరెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అవినాష్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

సునీత తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సిద్దార్ధలూథ్రా, ఈ వ్యవహారంలో అప్రూవర్‌గా మారిన వ్యక్తిని శివశంకర్‌రెడ్డి కొడుకు జైలుకు వెళ్లి బెదిరించారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఒక ప్రైవేటు డాక్టర్‌గా ఉన్న వ్యక్తి జైలుకు వెళ్లి సాక్షులను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని సునీత న్యాయవాది సిద్దార్ధలూథ్రా పేర్కొన్నారు. దీనిపై స్పందించిన సీజేఐ, వెళ్లిన డాక్టర్‌ రెగ్యులర్‌గా వెళ్లే వారా? కాదా? అని ప్రశ్నించారు.

జైలు నిబంధనలకు విరుద్ధంగా డాక్టర్‌ చైతన్య వెళ్లారని, డా.చైతన్య రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు నిర్వహించే వైద్యుడు కాదని కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసులో డాక్టర్‌ చైతన్య, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతివాదులుగా చేర్చాలని సుప్రీంకోర్టుకు సిద్ధార్థలూథ్రా విజ్ఞప్తి చేశారు. వివేకా హత్య కేసులో 8వ నిందితుడిగా అవినాష్‌ రెడ్డి ఉన్నారని, కేసు దర్యాప్తులో కీలకమైన వ్యక్తి అని లూథ్రా వాదించారు. దీంతో ఇరువురిని ప్రతివాదులుగా చేర్చడానికి సీజేఐ ధర్మాసనం అంగీకరించింది. దీనిపై విచారణను మార్చి 3వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే వారానికి వాయిదావేస్తున్నట్లు పేర్కొంది.

తాడేపల్లి ఇంట్లో జగన్ - అసెంబ్లీకి సునీత - ఆ ప్రశ్నకు త్వరలోనే సమాధానం?!

సునీత, రాంసింగ్, రాజశేఖరరెడ్డి పిటిషన్లపై విచారణ:మరోవైపువైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డి, సీబీఐ అధికారి రాంసింగ్, నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపైనా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమపై నమోదు చేసిన కేసులను క్వాష్ చేయాలని ఈ ముగ్గురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

విచారణ సందర్భంగా వివేకా హత్య కేసులో జరిగిన పరిణామాలను సునీత తరపు న్యాయవాది సిద్ధార్థలూథ్రా సుప్రీంకోర్టుకు వివరించారు. దర్యాప్తు అధికారిపై ప్రైవేటు కంప్లైంట్‌ ద్వారా విచారణ పురోగతిని అడ్డుకున్నారని వివరించారు. హత్య కేసును రూపు మాపాలని ప్రయత్నం చేశారని, ఆ తర్వాత రక్తపు వాంతులని ప్రచారం చేశారని లూథ్రా వాదించారు.

కోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు సాగుతోందని, ఆ పరిణామలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని లేనిపోని ఆరోపణలతో ప్రైవేటు ఫిర్యాదు చేశారని కోర్టుకు చెప్పారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం, తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 24కి వాయిదా వేసింది.

వివేకా హత్యకేసులో మరో నిందితుడు బయటకు - బెయిల్ ఇచ్చిన కోర్టు

ABOUT THE AUTHOR

...view details