ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓటుకు నోటు కేసు: రాజకీయ కక్షలుంటే బయట చూసుకోండి - ఆళ్ల పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీం - SC ON VOTE FOR NOTE CASE - SC ON VOTE FOR NOTE CASE

Supreme Court Dismissed Petitions of Alla Ramakrishna Reddy: ఓటుకు నోటు కేసులో వైఎస్సార్​సీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని నిందితుడిగా చేర్చడంతో పాటు సీబీఐ దర్యాప్తు చేపట్టాలని ఆయన దాఖలు చేసిన రెండు పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేస్తూ రాజకీయ యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హెచ్చరించింది. ఈ దారిలో వచ్చే బదులు కష్టపడి పనిచేసి ఎన్నికల్లో పోటీ చేయాలని జస్టిస్‌ ఎంఎం సుందరేష్‌, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లతో కూడిన ధర్మాసనం హితవు పలికింది.

alla_ramakrishna_petitions_dismissed
alla_ramakrishna_petitions_dismissed (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 21, 2024, 3:53 PM IST

Updated : Aug 21, 2024, 6:20 PM IST

Supreme Court Dismissed Petitions of Alla Ramakrishna Reddy:ఓటుకు నోటు కేసులో వైఎస్సార్​సీపీ మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈకేసులో చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ తాజాగా విచారణ జరిపించాలని, కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్‌ కుమార్లతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. రాజకీయ యుద్ధాలకు న్యాయస్థానాలను వేదికగా చేసుకోవద్దని హితవు పలికింది.

ఓటుకు నోటు కేసులో ఆళ్ల బాధితుడు కానీ, సాక్షి కానీ కాకపోయినా 2016లో ఆయన దాఖలు చేసిన ప్రైవేటు కంప్లయింట్‌ను పరిగణలోకి తీసుకొని అప్పటికే ఛార్జిషీట్ దాఖలైన కేసులో మళ్లీ పూర్తి స్థాయి దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. ఏసీబీ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైట్‌లో ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేస్తూ 2016 డిసెంబర్ 9న 97 పేజీల తీర్పు వెలువరించింది.

తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీలు, అలాగే ఈకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించి దర్యాప్తు చేయించాలని కోరుతూ ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ కూడా డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వాద, ప్రతివాదుల వాదనలను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి మాకు ఎలాంటి కారణం కనిపించలేదని, సీఆర్పీసీ సెక్షన్ 156(3)కు ఉన్న పరిధులను హైకోర్టు స్పష్టంగా గుర్తించిందని ధర్మాసనం కొట్టివేస్తూ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

అలాగే సెక్షన్ 156(3) కింద దిగువ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల వెనుక ఎలాంటి కారణాలు కనిపించ లేదని, అందువల్ల ఆ ఉత్తర్వులను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైనదే అని సమర్ధించింది. రెండు ఛార్జిషీట్లు దాఖలైన తర్వాత కూడా ఎమ్మెల్యే అయిన పిటిషనర్ ఫిర్యాదు చేశారని అభిప్రాయపడింది. అప్పీలుదారు అయిన ఆళ్లరామకృష్ణారెడ్డి తీసుకున్న చర్యలపై మేం ఏమాత్రం సంతృప్తి చెందలేదన్న సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టుకు వెళ్లకుండా ఈకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారని, అయితే అతను దాఖలు చేసిన ప్రాథమిక ఫిర్యాదునే కొట్టేసినందున ఇప్పుడు మళ్లీ దీనిపై సీబీఐ దర్యాప్తునకు అప్పగించాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని తుది ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

సాయంత్రం విచారణకు రండి - జోగి రమేష్​కు పోలీసుల నోటీసులు - Police Notices to Jogi Ramesh

అందువల్ల ఈ పిటిషన్లను డిస్మిస్ చేయడం మినహా అంతకు మించి ఎలాంటి వ్యాఖ్యానాలు చేయదలచుకోలేదని ధర్మాసనం అన్నది. తదుపరి రిమార్క్స్ చేయకుండా మేం స్వీయ నియంత్రణ పాటిస్తున్నాం అని జస్టిస్ ఎంఎం సుందరేష్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఈ కేసు విచారణను సీబీఐకి బదిలీ చేయాలని తెలంగాణ మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తాము అదే అంశంపై దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను ప్రత్యేకంగా చూడాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరుపు న్యాయవాది విజ్ఞప్తి చేశారు.

దీనికి జస్టిస్ సుందరేష్ స్పందిస్తూ మీరు ఆ కేసు ఉపసంహరించు కోవాలి అనుకుంటే చేసుకోండి దాని గురించి ఒత్తిడి చేయోద్దు అని సూచించారు. దాంతో సదరు న్యాయవాది ఆ అంశంపై తామేమీ ఒత్తిడి తేవడం లేదని ధర్మాసనానికి చెప్పగా న్యాయవాది పేర్కొన్న విషయాన్ని రికార్డుల్లోకి తీసుకుంటూ తాము ఆ రిట్‌ పిటిషన్‌పై ఒత్తిడి తేవడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో దాన్ని డిస్మిస్ యాజ్ నాట్ టు ప్రెస్డ్ అని జస్టిస్ సుందరేష్ ఉత్తర్వులు జారీ చేశారు.

రెండు పిటిషన్లు కొట్టివేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసే ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డి తరుపు న్యాయవాది సుదీర్ఘ వాదనలు వినిపించబోతుండగా జస్టిస్ ఎంఎం సుందరేష్ జోక్యం చేసుకుని 'మేం మీ వాదనలు విన్న తర్వాత సవివరమైన ఉత్తర్వులు జారీ చేయాలనుకుంటున్నాం. ఇందులో మేం ప్రత్యేకంగా కొంత చెప్పాలనుకుంటున్నాం. దయచేసి న్యాయస్థానాలతో ఇలా అడుకోకండి అని హెచ్చరించారు. మీ రాజకీయ యుద్ధాలను రక్షించడానికి మేం ఇక్కడ లేం అందుకు ఇది వేదిక కాదు. మీరు ఇక్కడ న్యాయపరమైన అంశాలుంటే వాదించండి అని వ్యాఖ్యానించారు.

జగన్​ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దు - కోర్టును కోరిన సీబీఐ - jagan Foreign tour Petetion

రాజకీయ యుద్ధాన్ని ఇక్కడికి తీసుకొచ్చి సీఆర్పీసీ సెక్షన్ 210 కింద ఒక కేసు, రిట్ పిటిషన్ రూపంలో మరో కేసు వేసి మీరు చెప్పేదంతా వినడానికి ఇక్కడ లేము. మీరు అయిదేళ్లు వేచి చూసి మరో ఎన్నికలో గెలిచి రండి అని జస్టిస్‌ సుందరేష్‌ అన్నారు. మీ వాదనలు ఓపిగా విన్నాం. ఇక చాలు మాకున్న స్వల్ప అనుభవంతో ఈ కేసును అర్ధం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్న న్యాయమూర్తి, ఈకేసులో ముందుగానే ఒక ఫిర్యాదుదారు ఉన్నారు. వారి వాదనలు విన్న అనంతరం తుది చార్జిషీట్ దాఖలు చేశారు. ఒకవేళ అందులో ఏదైనా చెప్పుకోవడానికి మీరు అర్హత ఉంటే ఎప్పుడైనా ఆ పని చేయొచ్చు. అంతే తప్ప ఇందులో ఎవరినో ఇరికించడానికి సమాంతర దర్యాప్తు జరపాలని కోరలేరు అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

న్యాయస్థానాలు జారీ చేసే ఉత్తర్వులు పరిస్థితులను ప్రతిబింబించాలి. కారణాలు లేకుండా జారీ చేసే ఉత్తర్వులను ఆత్మ లేని దానిగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కష్టపడి పని చేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని మీ క్లయింట్‌కి చెప్పండి ఆది ఉత్తమం. ఈ దారిలో కాదు అని జస్టిస్ సుందరేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి తరుపు న్యాయవాదికి సూచించారు.

'పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో రావాలి' - కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు - AP CM Chandrababu Sri City Visit

Last Updated : Aug 21, 2024, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details