తెలంగాణ

telangana

ఇనుప సంకెళ్ల ఉచ్చులో మానసిక దివ్యాంగులు - మూఢనమ్మకానికి బందీలు - దైవాజ్ఞ పేరిట అమానవీయం - INHUMAN INCIDENTS IN WARANGAL

By ETV Bharat Telangana Team

Published : Aug 28, 2024, 8:37 AM IST

Superstitious Beliefs : వారంతా ఏ తప్పు చేయని అమాయకులు. ఎన్నో ఏళ్లుగా ఇనుప గొలుసులతో బందీలయ్యారు. ఏ చట్టమూ పట్టించుకోని అభాగ్యులు. కాపాడేవారు లేక గొలుసు బందీలుగా స్తంభాలకు వేలాడుతున్నారు. మాకెందుకు ఈ శిక్ష అని ప్రశ్నించలేని మానసిన దివ్యాంగుల పాలిట అయినవారే శాపమయ్యారు. ఈ అమానవీయాన్ని అడ్డుకోని అధికారుల ఉదాసీనతే ఆ అమాయకుల జీవితాన్ని ఛిద్రం చేస్తోంది.

Superstitious Beliefs Victims are Being Chained to Places of Worship
Superstitious Beliefs Victims are Being Chained to Places of Worship (ETV Bharat)

Superstitious Beliefs Victims are Being Chained to Places of Worship :వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో పేరెన్నికైన ఓ ప్రార్థనా స్థలంలో మానసిక దివ్యాంగులకు అశాస్త్రీయ విధానంలో చికిత్స అందిస్తున్నారు. మానసిక వ్యాధుల నిపుణులు, ఇతర డాక్టర్లు ఎవ్వరూ లేకుండా దేవుడు కరుణిస్తాడనే మూఢనమ్మకంతో అమాయకులను ఏళ్ల తరబడి గొలుసులతో కట్టేసి బంధిస్తున్నారు.

ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చినా ఆస్పత్రులకు వెళ్లకుండా కొన్ని కుటుంబాలు మానసిక దివ్యాంగులైన తమ వారిని ఈ ప్రార్థనా స్థలానికి తీసుకువస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులే ఉండటం గమనార్హం. ఆడ, మగ, ముక్కుపచ్చలారని పిల్లలు, నవ యువకులు, వృద్ధులు ఇక్కడ బాధితులుగా గొలుసుల మధ్య బందీ అయ్యారు.

ఏదో ఊహించని ఘటనతో, తీవ్ర ఒత్తిడితో, ప్రేమ విఫలంతో, కుటుంబ సమస్యలతో మతిస్థిమితం తప్పిన వారిని మొదట్లో ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఆరోగ్యం కుదుట పడలేదని, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక పోతున్నామంటూ దేవుడి కృపతో వాళ్లు బాగైపోతారని భావించి చాలా మంది తమవారి ఇక్కడికి తీసుకొస్తున్నారు. ప్రార్థనా స్థలానికి వచ్చాక బాధితులను 41 రోజులు నిద్ర చేయిస్తారు. మూడు పుటలా ప్రార్థనలకు తీసుకొస్తారు. అప్పటికీ వారిలో ఎలాంటి మార్పు లేకుంటే దేవుడి ఆజ్ఞగా భావిస్తూ వారిని అక్కడే ఇనుప గొలుసులతో కట్టేస్తారు. దేవుడి నుంచి ఆజ్ఞ వస్తేనే, సెలవు మంజూరు చేసి ఇంటికి పంపిస్తామని వాళ్లను అక్కడే బందీ చేస్తారు.

పాముకాటుతో బాలిక మృతి.. బతికించేందుకు మృతదేహానికి పేడ పూసి, వేప కొమ్మలతో పూజలు..

చేతులను, కాళ్లను గొలుసులతో కట్టి :ప్రస్తుతం గ్రామంలో 50 మంది మానసిక వికలాంగులు ఉన్నారు. కొందరికి వారి బంధువులే దగ్గరుండి సేవలు చేస్తుంటే మరికొందర్ని ప్రైవేటు స్టే హోంలలో చేర్చుతున్నారు. ఇంకొందరు చూసుకోడానికి ఎవరూ లేక రోడ్లపై తిరుగుతున్నారు. బాధితులు చేతులు, కాళ్లకు గొలుసులతో తిరుగుతున్న వారిని చూసి పిల్లలు భయపెడుతున్నారు. లోకం తెలియని ఈ బాధితులను ఏమీ అనలేం పాపం అని స్థానికులే సర్దుకుపోతున్నారు.

18సంవత్సరాల నుంచి ప్రార్థనా స్థలంలోనే :ఆదిలాబాద్ జిల్లా ఉక్కునుర్‌కు చెందిన ఓ వ్యక్తి వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఆ సమయంలో ఆయన మానసిక పరిస్థితి అదుపుతప్పింది. గంటకో తీరుగా ప్రవర్తన ఉండేది. దీంతో ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. దాదాపు 18సంవత్సరాలుగా ఆయన ఇక్కడే ఉంటున్నారు. అప్పటినుంచి కాళ్లకు, చేతులకు ఇనుప గొలుసుతో స్థానిక ప్రైవేటు హోంలోనే ఉంటున్నారు.

ఆరోగ్యం కుదుటపడినా ఇక్కడే :హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యక్తి 23సంవత్సరాలుగా ఇక్కడే బందీగా ఉంటున్నారు. డిగ్రీ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవారు. జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుందన్న సమంయలో మానసిక సమస్యలు తలెత్తాయి. రోజురోజుకూ సమస్యలు పెరగడంతో కుటుంబ సభ్యులు అతన్ని ఇక్కడికి తీసుకువచ్చి వదిలేశారు. నాలుగైదు సంవత్సరాల తర్వాత ఆరోగ్యం కుదుటపడినా అతను ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ఆసుపత్రుల్లో చూపించారు. అతనికి నయం కాకపోవడంతో ఇక్కడికి తీసుకువచ్చి వదిలేశారు. నాలుగు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు.

marriage with goat: 'మేక'ను పెళ్లి చేసుకున్న యువకుడు.. కారణం తెలిస్తే షాక్..!

Superstitions: ఎదుగుదలను అడ్డుకుంటున్నాారని.. రాళ్లతో కొట్టి చంపాడు..

ABOUT THE AUTHOR

...view details