ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్వీ వర్సిటీలో చిరుత - భయం గుప్పిట్లో విద్యార్థులు - LEOPARD AT TIRUPATI SV UNIVERSITY

ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో చిరుతపులి సంచారం - పాదముద్రలు గుర్తించిన అధికారులు - విద్యార్థులకు పలు ఆదేశాలు జారీ

Students Spot Leopard At Tirupati SV University Auditorium
Students Spot Leopard At Tirupati SV University Auditorium (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 20, 2024, 7:45 PM IST

Students Spot Leopard At Tirupati SV University Auditorium : తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఆడిటోరియం ముందు చిరుతపులి వెళ్తుండగా విద్యార్థులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వర్శిటీ అధికారులు అటవీశాఖ సిబ్బందికి తెలియజేయడంతో యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను పరిశీలించారు. చిరుత సంచరించిన ప్రాంతంలో పరిశీలించడంతో చిరుతపులి పాదముద్రలు ఉన్నట్లు గుర్తించారు.

అనంతరం చిరుత సంచారాన్ని పసిగట్టేందుకు పరిసర ప్రాంతాలలో కెమెరా ట్రాపర్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి ఎనిమిది తర్వాత బయటికి రావద్దని, ఉదయం ఆరున్నర తర్వాతనే బయట తిరగాలని ఎస్వీయూ అధికారులు విద్యార్థులకు ఆదేశాలు జారీ చేశారు.

ABOUT THE AUTHOR

...view details