Andhra Pradesh Weather Update :బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది మంగళవారం తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ప్రస్తుతం ఇది శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు ప్రయాణిస్తోందని వాతావరణశాఖ పేర్కొంది. అనంతరం వాయుగుండంగా బలపడుతుందని, దీని ప్రభావంతో నేడు, రేపు (బుధ, గురువారాల్లో) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది.
వచ్చే వారం మరో అల్పపీడనం- పది రోజులు కోస్తా, రాయలసీమలో వానలు - AP WEATHER UPDATE
అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 11, 2024, 7:29 AM IST
Strengthened Low Pressure in Bay of Bengal :మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని, పిడుగులు కూడా పడొచ్చని అంచనా వేస్తోంది. వచ్చే వారం అండమాన్ సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వివరించింది. దాని ప్రభావంతో ఈ నెల 20 వరకు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.
కొనసాగుతున్న అల్పపీడనం - ధాన్యంపై కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం