ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పొలంలో రాళ్లు ఉన్నా చింత అవసరం లేదు - కొత్త యంత్రం వచ్చేసిందంటున్న రైతులు - stone removal machine in farms - STONE REMOVAL MACHINE IN FARMS

Stone Removal Machine Available In Prakasam District : మీ పొలంలో రాళ్లు ఉన్నాయా. ఇక చింతించకండి. ఎలాంటి రాళ్ల నేలనైనా చక్కగా సాగు భూమిగా మార్చే యంత్రం ఒకటి రైతులకు అందుబాటులోకి వచ్చింది. కూలీలతో రోజుల తరబడి రాళ్లు ఏరించినా సాగుకు అంత అనుకూలంగా ఉండని నేలలో ఈ యంత్రం ద్వారా రాళ్లు ఏరిస్తే గంటల్లో సాగుకు తయారవుతుంది. ఇంతకీ ఆ యంత్రం ఏమిటో? దాన్ని ఎవరూ? అందుబాటులోకి తెచ్చారో తెలుసుకుందామా?

Stone Removal Machine Available In Prakasam District
Stone Removal Machine Available In Prakasam District (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 16, 2024, 3:19 PM IST

Stone Removal Machine Available In Prakasam District : సాధారణంగా పంటలో కలుపు మొక్కలు ఉంటే కూలీలతో తొలగిస్తాం. వ్యవసాయం ఆధునికం కావడంతో అది కూడా ఓ యంత్రంతో తొలగించే అవకాశం ప్రస్తుతం వచ్చింది. మరీ రాళ్లూ రప్పలతో ఉన్న సాగుకు ఉపయోగపడని భూమి ఉంటే ఏం చేస్తాం? ఖాళీగా వదిలేస్తాం. మహా అయితే పైపైన రాళ్లను కూలీలతో తొలగించి, పరిమితమైన పంటను వేస్తాం. కానీ ఇప్పుడా బాధ లేదు. ఎలాంటి రాళ్ల నేలనైనా చక్కగా సాగు భూమిగా మార్చే యంత్రం ఒకటి రైతులకు అందుబాటులోకి వచ్చింది. కూలీలతో రోజుల తరబడి రాళ్లు ఏరించినా సాగుకు అంత అనుకూలంగా ఉండని నేలలో ఈ యంత్రం ద్వారా రాళ్లు ఏరిస్తే గంటల్లో సాగుకు తయారవుతుంది. ఇది ప్రకాశం జిల్లాలో ఓ రైతు మధ్యప్రదేశ్‌ నుంచి కొనుగోలు చేసి ఇక్కడ రైతులకు అందుబాటులోకి ఉంచారు.

రాళ్ల భూమిని సాగు భూమిగా:ప్రకాశం జిల్లాలో వేలాది ఎకరాల భూమి సాగుకు ఎందుకూ పనికి రాకుండా వృథాగా ఉన్నాయి. దానికి కారణంగా నేల రాళ్లతో నిండి ఉండటం. నేలను సాగులోకి తీసుకురావాలంటే ఈ రాళ్లను మనుషులతో ఏరిస్తుంటారు అక్కడా. దీనికి ఖర్చు సైతం ఎక్కువ. అంత ఖర్చు పెట్టినా అంతంత మాత్రంగానే రాళ్లను తొలగించగలరు. వేళ్లు భూమిలోపలకు చొచ్చుకొని పోకపోవడం వల్ల మొక్క ఎదుగుదల ఉండదు. అందువల్ల పొలం ఉన్నా, రాళ్ల పొలాలు కావడం వల్ల చాలా మంది రైతులు ఆ భూములను వృథాగా వదిలేస్తారు. దీంతో పిచ్చి మొక్కలు పెరిగి అడవులను తలపిస్తాయి.

రైతులకు అలర్ట్ - ఈ-పంట నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్నారా? లేకుంటే అంతే సంగతులు! - government on e crop registrations

సమస్యను స్వయంగా చూసి పరిష్కారం : పశ్చిమ ప్రకాశం అయిన కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండ ప్రాంతంలో ఇలాంటి రాళ్ల నేలలు అధికంగా కనిపిస్తాయి. ఈ సమస్యను స్వయంగా చూసిన కొమరోలుకు చెందిన రంగస్వామి, అతని సోదరుడు మల్లిఖార్జునరావులు రాళ్లు ఏరేందుకు ఏదైనా యంత్రం ఉందేమోనని పరిశోధించారు. చివరికి మద్యప్రదేశ్​లో దీన్ని తయారు చేస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లీ కావాల్సివ విధంగా యంత్రాన్ని తయారు చేయించుకున్నారు.

"మేము మధ్యప్రదేశ్ నుంచి ఈ యంత్రాన్ని తీసుకువచ్చాం. ఇది 10 లక్షల 40 వేలు రూపాయలు పడింది. రైతులు కూలీలతో రాళ్లను ఏరుతుంటే దానికి ప్రత్యామ్నయ మార్గాన్ని కనుక్కోవాలనే ఆలోచన వచ్చింది. ఈ యంత్రం అందుబాటులోకి రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సొంతంగా పొలాలు ఉన్నప్పటికీ ఈ రాళ్లు ఏరే యంత్రం ద్వారా సాగునేలను అభివృద్ధి చేయడం ఆనందంగా ఉంది. గంటకు దాదాపు 2,700 రూపాయలు అద్దె వసూలు చేస్తున్నాం. ఇలాంటి యంత్రాలు మరిన్ని అందుబాటులోకి వస్తే, సాగునేల విస్తీర్ణం బాగా పెరుగుతుంది." - రంగస్వామి, యంత్రం నిర్వాహకుడు

ఈ యంత్రం అందుబాటులోకి రావడంతో తమ పొలాలు ఇక సాగుకు పనికి వస్తాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అన్నదాతల అగచాట్లు - శీతల గోదాములు లేక పంటను నిల్వ చేసేందుకు విలవిల - FARMERS SUFFERING IN GUNTUR

బుడమేరు వరదతో పత్తి పంట నాశనం - ఆత్మహత్యే శరణ్యమంటున్న రైతులు - COTTON CROP DAMAGE DUE TO FLOODS

ABOUT THE AUTHOR

...view details