ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో కన్నువ పండువగా రాములవారి కల్యాణం - Sri Ram Navami Celebrations - SRI RAM NAVAMI CELEBRATIONS

Sri Ram Navami Celebrations in AP: సీతారాముల కల్యాణ మహోత్సవానికి రాష్ట్రవ్యాప్తంగా ఆలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఎటుచూసినా తోరణాలు, చలువ పందిళ్లతో కల్యాణ వైభవం కనిపిస్తోంది. రాములోరి కల్యాణ వేడుకను కనులారా వీక్షించేందుకు అశేష భక్తజనం తరలివచ్చారు.

Sri_Ram_Navami_Celebrations_in_AP
Sri_Ram_Navami_Celebrations_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 17, 2024, 3:32 PM IST

Sri Ram Navami Celebrations in AP: రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పుణ్యక్షేత్రాలన్నీరామనామంతో మార్మోగాయి. సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయాల ముందు భక్తులు బారులు తీరారు.

రాష్ట్రంలో కన్నువ వైభవంగా రాములవారి కల్యాణ మహోత్సవం

జగదభిరాముడి కల్యాణం.. జగమంతా ఆనందం.. లోకకల్యాణానికి ఆరంభం

ChandraBabu Naidu Wishes: శ్రీరామనవమిని పురస్కరించుకుని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రజలందరికి సామాజిక మాధ్యమం ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నామంటే దానికి కారణం శ్రీరాముని పాలన అని చంద్రబాబు అన్నారు. మరి కొద్ది రోజుల్లో రాష్ట్ర ప్రజలకు సుఖశాంతులతో ఉన్న రామరాజ్యం రావాలని కోరుకున్నామని తెలిపారు. సీతారాముల‌ దయతో ప్రజలు ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని లోకేష్‌ ఆకాంక్షించారు.

మంగళగిరిలో కన్నుల పండువగా కల్యాణం:మంగళగిరిలో శ్రీరామనవమి వేడుకల్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు. 6వ బెటాలియన్ ఏపీఎస్​పీ క్యాంపు వద్ద శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో సీతారాముల కల్యాణం కన్నుల పండువగా జరిగింది. కల్యాణ వేడుకలో పాల్గొన్న నారా లోకేష్ స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు

హిందూపురంలో బాలకృష్ణ సతీమణి పూజలు: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర శ్రీరామ నవమిని పురస్కరించుకొని హిందూపురంలోని సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం సీతారాముల కల్యాణోత్సవంలో ఆమె పాల్గొన్నారు.

ఒంటిమిట్టలో వైభవంగా శ్రీ కోదండరాముని రథోత్సవం

Sriramanavani Celebrations at Krishna,Ntr Districts: కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సీతారామస్వామి కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం పునాదిపాడులో ప్రతిసంవత్సరం గ్రామస్థులంతా కలిసి శ్రీరామనవమి నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. గ్రామస్థులు సీతారాముల్ని ఊరేగింపుగా తీసుకొచ్చి ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహిస్తారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఐతవరంలో మైలవరం శాసనసభ్యుడు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కుటుంబ సమేతంగా పట్టువస్త్రాలు, తలంబ్రాలను మేళతాళాలతో ఉరేగింపుగా తీసుకువచ్చి వేద పండితులకు సమర్పించారు. అనంతరం గ్రామస్థులతో కలసి కళ్యాణ వేడుకను తిలకంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Vontimitta: 15న ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం... ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Konaseema: అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేటలో సీతారామచంద్రస్వామి ఆలయాల వద్ద స్వామివారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంత యానంలో శ్రీరామనవమి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈనెల 19వ తేదీన యానంలో పుదుచ్చేరి పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నవమి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆంక్షలు విధించడంతో గ్రామాలలోని ఆలయాల వద్ద సందడి తగ్గింది.

ABOUT THE AUTHOR

...view details