MAHA KUMBH IRCTC package :ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ఈ నెల 14 నుంచి 45 రోజుల పాటు జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోన్న రైల్వే శాఖ తాజాగా తెలుగు రాష్ట్రాల మరిన్ని రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. రెండు రాష్ట్రాల నుంచి అదనంగా మరో 26 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం, కాకినాడ టౌన్ నుంచి రైళ్లు బయల్దేరనుండగా తెలంగాణలో మౌలాలి జంక్షన్, వికారాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు వెళ్లనున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగే మహాకుంభమేళా నిర్వహణకు భక్తుల అవసరాలు, భద్రత కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో 45 కోట్ల మంది భక్తులు గంగాస్నానం ఆచరించే అవకాశం ఉందని అధికారవర్గాల అంచనా.
ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలివీ..
కాశీ, వారణాసి వెళ్లాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న వారికి ఇప్పుడు చక్కని అవకాశం వచ్చింది. మరికొద్ది రోజుల్లో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. ఇదే సమయంలో కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసొచ్చేలా ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీతో ముందుకొచ్చింది. జనవరి 14 నుంచి 45 రోజుల పాటు జరగనున్న ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే బంపర్ ఆఫర్ - సంక్రాంతికి మరో 52 ప్రత్యేక రైళ్లు! - బుకింగ్ ఓపెన్
ప్రయాణం ఇలా..
విశాఖ- గోరఖ్‌పూర్ మధ్య జనవరి 5, 19, ఫిబ్రవరి 16 తేదీల్లో ప్రత్యేక రైలు(08562)ను ఈస్ట్‌కోస్ట్ రైల్వే నడపనుంది. ఆదివారం రాత్రి బయల్దేరి మంగళవారం రాత్రి గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. తిరిగి (08561) జనవరి 8, 22, ఫిబ్రవరి 19 తేదీల్లో బుధవారాల్లో మధ్యాహ్నం బయల్దేరి శుక్రవారం విశాఖపట్నం చేరుకుంటుంది. విజయనగరం, శ్రీకాకుళం రోడ్డు, పలాస, బ్రహ్మపుర, ఛత్రపూర్, బలుగావ్, ఖుర్దారోడ్డు, భువనేశ్వర్ తదితర స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. ఇక
సికింద్రాబాద్ నుంచి తొలి రోజు ఉదయం 9:25 గంటలకు (దానాపూర్ ఎక్స్‌ప్రెస్) ప్రారంభమవుతుంది. రెండో రోజు మధ్యాహ్నం 1.30గంటలకు వారణాసి చేరుకుని ముందుగా బుక్ చేసిన హోటల్‌కు చేరుకుంటారు. అదేరోజు సాయంత్రం గంగ హారతి దర్శించుకున్న అనంతరం రాత్రి భోజనం, బస అక్కడే ఉంటుంది.
మూడో రోజు ఉదయం టిఫిన్ తర్వాత వారణాసిలోని ప్రసిద్ధ ఆలయాల (కాశీ విశ్వనాథ ఆలయం, కాలభైరవ్ మందిర్, బిర్లా మందిర్ )ను సందర్శించుకోవచ్చు. సాయంత్రం షాపింగ్, వ్యక్తిగత పనులు చూసుకున్న అనంతరం రాత్రి భోజనం, బస వారణాసిలోనే ఉంటుంది.