Special Trains for Ayyappa Devotees :శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల (Sabarimala Special Trains) కోసం వైఎస్సార్ జిల్లా కడప మీదుగా కొట్టాయం, కొల్లాంలకు నవంబరులో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్‌స్పెక్టరు ఎ జనార్దన్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు.
త్వరలోనే విజయవాడకు మెట్రో రైలు - కేంద్రానికి ప్రతిపాదనలు
- 07133 నంబరు గల రైలు కాచిగూడలో ఈ నెల 14, 21, 28వ తేదీల్లో మధ్యాహ్నం 3.40 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 12.10 గంటలకు కడపకు, తర్వాత రోజు సాయంత్రం 6.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07134) 15, 22, 29వ తేదీల్లో రాత్రి 8.30 గంటలకు కొట్టాయంలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు కడపకు, రాత్రి 11.40 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
- నాందేడ్ నుంచి మరో రైలు(07139) ఈ నెల 16వ తేదీ ఉదయం 8.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడపకు, రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు (07140) 18వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లాంలో బయలుదేరి అదే రోజు రాత్రి 11 గంటలకు కడప, మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలును తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ వరకు మాత్రమే వేశారు.
- 07135 నంబరు గల రైలు హైదరాబాద్‌లో ఈ నెల 19, 26వ తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి రాత్రి 10.25 గంటలకు కడపకు, తరువాత రోజు సాయంత్రం 4 గంటలకు కొట్టాయం వెళ్లనుంది. తిరుగు ప్రయాణంలో (07136) 20, 27వ తేదీల్లో సాయంత్రం 6.10 గంటలకు కొట్టాయంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.50 గంటలకు కడపకు, రాత్రి 11.45 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.