తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిగడ్డ ఆనకట్టలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ - ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు - Judicial Inquiry on Kaleshwaram - JUDICIAL INQUIRY ON KALESHWARAM

Kaleshwaram Project Judicial Inquiry Updates : కాళేశ్వరం ఆనకట్టలపై విచారణలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, నివేదనలు తీసుకోవడం కోసం బీఆర్కే భవన్​లో ప్రత్యేక పెట్టెలను ఏర్పాటు చేశారు. 3 ఆనకట్టలైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై విడివిడిగా పెట్టెలు పెట్టారు. ఇతర అంశాల కోసం ప్రత్యేకంగా మరో పెట్టె ఏర్పాటు చేశారు.

Kaleshwaram Project
Kaleshwaram Project Judicial Inquiry Updates

By ETV Bharat Telangana Team

Published : Apr 26, 2024, 7:12 PM IST

Kaleshwaram Judicial Inquiry Updates : కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై విచారణలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, నివేదనలు తీసుకోవడంతో పాటు తదుపరి కార్యాచరణపై కసరత్తు జరుగుతోంది. ప్రజలు కూడా ఫిర్యాదులు, నివేదనలు సమర్పించేందుకు జస్టిస్‌ పీసీ ఘోష్ కమిషన్ మే నెలాఖరు వరకు గడువు ఇచ్చింది. అన్ని పని దినాల్లో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు తగిన సాక్ష్యాధారాలతో అఫిడవిట్ల రూపంలో బీఆర్కే భవన్​లో దాఖలు చేయవచ్చు. ఇందుకోసం బీఆర్కే భవన్​లో ప్రత్యేక పెట్టెలను ఏర్పాటు చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 ఆనకట్టలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లపై కమిషన్ విచారణ జరుపుతోంది. అందులో భాగంగా మూడు ఆనకట్టలకు విడివిడిగా పెట్టెలను ఏర్పాటు చేశారు. ఇతర అంశాల కోసం ప్రత్యేకంగా మరో పెట్టె మొత్తం 4 పెట్టెలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విచారణ ప్రారంభించిన జస్టిస్ పీసీ ఘోష్, తదుపరి కార్యాచరణపై కూడా దృష్టి సారించారు. ఇందులో భాగంగా నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్సీలు అనిల్, నాగేందర్ రావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తో వరుసగా రెండో రోజు సమావేశమయ్యారు. ఆనకట్టలకు సంబంధించిన అంశాలతో పాటు విచారణ ప్రక్రియ, కసరత్తుపై జస్టిస్ పీసీ ఘోష్ వారితో చర్చించారు. అవసరమైన వివరాలు, దస్త్రాలను తీసుకున్నారు. మూడు ఆనకట్టలకు సంబంధించిన డాక్యుమెంట్స్​ను కమిషన్ రేపు పరిశీలించే అవకాశం ఉంది. జస్టిస్ పీసీ ఘోష్ రేపు సాయంత్రం కోల్​కతా వెళ్లనున్నారు.

సాక్ష్యాలు పరిశీలించాక ఎవర్ని విచారణకు పిలవాలో నిర్ణయిస్తాం : జస్టిస్ పీసీ ఘోష్ - Justice PC Ghose On Kaleshwaram

నెల రోజుల గడువు : కాళేశ్వరం ఆనకట్టలపై సాంకేతికంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సాక్ష్యాలు, వాస్తవాల ప్రాతిపదికన విచారణ సాగిస్తామని జస్టిస్ పీసీ ఘోష్ ఇటీవల తెలిపారు. మీడియాతో చిట్​చాట్​గా మాట్లాడిన ఆయన, మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలపై ఇప్పటికే విచారణ ప్రారంభమైందని, సాంకేతికంగా, అన్ని రకాలుగా అన్ని అంశాలు పరిశీలిస్తామని వివరించారు. ఆనకట్ట లోపాలు, అంశాలపై బహిరంగ ప్రకటన ఇచ్చి ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఎవరైనా అఫిడవిట్ దాఖలు చేసి అభిప్రాయాలు చెప్పవచ్చని, సాక్ష్యాలు సమర్పించవచ్చని పీసీ ఘోష్ తెలిపారు. ఇందుకోసం నెల రోజుల గడువు ఇవ్వనున్నట్లు వివరించారు. ఆయన చెప్పిన మేరకు ప్రజలు ఫిర్యాదులు, నివేదనలు సమర్పించేందుకు బీఆర్కే భవన్​లో పెట్టెలను ఏర్పాటు చేశారు.

కాళేశ్వరంపై కమిషన్‌ న్యాయ విచారణ షురూ - judicial inquiry on kaleshwaram

వేసవి సెలవుల తర్వాతే కాళేశ్వరం పిటిషన్ల విచారణ : హైకోర్టు - hc on kaleshwaram project

ABOUT THE AUTHOR

...view details