ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రయాణికులకు గుడ్​న్యూస్ - సంక్రాంతికి మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ - SANKRANTI SPECIAL TRAINS

సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 6 రైళ్లు ఏర్పాటుచేసిన దక్షిణ మధ్య రైల్వే - హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు

SANKRANTI_SPECIAL_TRAINS
SANKRANTI_SPECIAL_TRAINS (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 8, 2025, 10:27 PM IST

South Central Railway Arranged Special Trains for Sankranti:రాష్ట్రంలో అతి పెద్ద పండగ సంక్రాంతి. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం హైదరాబాద్​, బెంగళూరు వంటి నగరాల్లో పని చేస్తున్న వారు కచ్చితంగా తమ సొంతూళ్లకు చేరుకుంటారు. అయితే సంక్రాంతి పండగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లేవారికి దక్షిణ మధ్య రైల్వే గుడ్ ​న్యూస్​ చెప్పింది. పండగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని స్పెషల్​ రైళ్లను నడపనుంది.

ఈ సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని గతంలో సౌత్ సెంట్రల్ రైల్వే కొన్ని స్పెషల్ ట్రైన్లను ఏర్పాట చేయగా తాజాగా మరికొన్ని స్పషల్ ట్రైన్లను ఏర్పాటు చేసింది. ఇవి హైదరాబాద్, చర్లపల్లి, కాకినాడ, తిరుపతి మధ్య ఈ 6 ట్రైన్లు నడవనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కూడా దక్షిణ మధ్య రైల్వే కల్పించింది.

ట్రైన్ల వివరాలు ఇవే:

  • హైదరాబాద్ నుంచి ఏపీలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు
  • ఈ నెల 10న రాత్రి 8.15 గం.కు హైదరాబాద్ నుంచి కాకినాడకు రైలు
  • ఈ నెల 11న సాయంత్రం 5.40 గం.కు కాకినాడ నుంచి హైదరాబాద్‌కు రైలు
  • ఈ నెల 12న రాత్రి 9.45 గం.కు హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు
  • ఈ నెల 13న సా. 4.35 గం.కు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు రైలు
  • ఈ నెల 11న రాత్రి 8 గం.కు చర్లపల్లి నుంచి కాకినాడ టౌన్‌కు ప్రత్యేక రైలు
  • ఈ నెల 12న రాత్రి 7.40 గం.కు కాకినాడ టౌన్ నుంచి చర్లపల్లికి ప్రత్యేక రైలు

మరికొన్ని స్పషల్ ట్రైన్లు: కొద్ది రోజుల క్రితం కాచిగూడ, చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్‌ మధ్య 6 స్పెషల్ సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అవి జనవరి 11, 12, 15, 16వ తేదీల్లో కాచిగూడ నుంచి శ్రీకాకుళం రోడ్‌ మధ్య ఈ ట్రైన్స్​ రాకపోకలు సాగించనున్నాయి. అదే విధంగా చర్లపల్లి నుంచి శ్రీకాకుళం రోడ్డుకు 8, 9వ తేదీల్లో రెండు ట్రైన్స్ నడుస్తున్నాయి.

రాష్ట్రానికి వందే భారత్ స్లీపర్ - ఆ రెండు మార్గాల్లో కొత్త రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే బంపర్​ ఆఫర్ - సంక్రాంతికి మరో 52 ప్రత్యేక రైళ్లు! - బుకింగ్ ఓపెన్

ABOUT THE AUTHOR

...view details