Special Trains From secunderabad to KumbhMela 2025: మహకుంభ మేళాకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం భారతీయ రైల్వే 13వేలకు పైగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఈ రైళ్లను అందుబాటులో ఉంచినట్లు రైల్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 10 వేల రెగ్యులర్ సర్వీసులు, వాటికి అదనంగా మరో 3,100 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది.
దక్షిణ మధ్య రైల్వే జోన్ 142 ప్రత్యేక సర్వీసులు, ఇతర జోన్ల నుంచి దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా మరో 40 రైళ్లను నడిపిస్తుంది. ఇక కుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. కుంభమేళా ప్రత్యేక రైళ్లపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వోతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
"మహాకుంభమేళాను పురస్కరించుకుని భారతీయ రైల్వే ఇప్పటి వరకు 13వేల పైచిలుకు రైళ్లను నడుపుతుంది. దీనిలో 10వేల రెగ్యులర్ ట్రైన్స్‌కు తోడు 3వేల స్పెషల్ రైళ్లను ప్రయాగ్‌రాజ్ లాంటి చుట్టు పక్కలా స్టేషన్స్‌కి ప్లాన్ చేశాం. ఇందులో భాగంగానే దిల్లీ, కోల్కత్తా, పాట్నా, ముంబయి, సికింద్రాబాద్, బెంగళూరు వంటి వాటి నుంచి సిద్ధం చేయడం జరిగింది" -శ్రీధర్, సీపీఆర్వో, సౌత్ సెంట్రల్ రైల్వే