SLBC meeting Chaired by CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఎల్బీసీ (State Level Banker's Committee) సమావేశం ముగిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక తొలిసారి సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరిగింది. బ్యాంకర్లకు ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏపీ సీఎం చంద్రబాబు వివరించారు. తొలుత 4వ సారి ముఖ్యమంత్రి అయిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఎస్ఎల్బీసీ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశానికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు, యూనియన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజయ్ రుద్ర, ఎస్.ఎల్.బీసీ కన్వీనర్ సీవీఎన్ భాస్కర్ రావు, ఇతర బ్యాంకు అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
డీబీటీ పథకాల అమలు, అభివృద్ధి కార్యక్రమల నిర్వహణకు బ్యాంకర్ల సాయం అవసరమని చంద్రబాబు తెలిపారు. సబ్సిడీపై ఇచ్చే రుణాలు, వివిధ పథకాల కింద లబ్దిదారులకు చేసే సాయం విషయంలో బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులు ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారాన్ని బ్యాంకర్లు సీఎం దృష్టికి తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలతో పాటు బ్యాంకింగ్ రంగాన్ని ఛిన్నాభిన్నం చేశారని మంత్రులు పేర్కొన్నారు. వ్యవసాయ రంగం, పరిశ్రమలకు ప్రొత్సాహం, డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్ల పాత్రే కీలకమని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏపీలో ఉచిత ఇసుక విధానం వచ్చేసింది- జీవో జారీ చేసిన ప్రభుత్వం - Free Sand Policy Guidelines
కీలక నిర్ణయాలు:
• 2024-25 సంవత్సరానికి రుణప్రణాళిక విడుదల చేసిన ఎస్‌ఎల్‌బీసీ
• ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.5.4 లక్షల కోట్లతో రుణ ప్రణాళిక విడుదల.
• రూ.3.75 లక్షల కోట్లు ప్రాధాన్య రంగాలకు, రూ.1.65 లక్షల కోట్లు ఇతర రంగాలకు కేటాయిస్తూ రుణ ప్రణాళిక.
• వ్యవసాయ రంగానికి రూ.2.64 లక్షల కోట్లు రుణాలు లక్ష్యం. వ్యవసాయ రంగానికి గతం కంటే 14 శాతం అధిక రుణాలు.