తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదాలు - ఏడుగురు మృతి - Road Accidents at YSR District

Several People Died in Road Accident at YSR District In AP : ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్​ జిల్లా గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. చింత కొమ్మదిన్నె పరిధిలో కారు కంటైనర్‌ను ఢీకొట్టడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఘటనలో దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడి ఇద్దరు మృతి చెందారు.

Road Accident In YSR DIST In AP
Road Accident In YSR DIST In AP (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 26, 2024, 10:45 PM IST

Road Accident In YSR Dist In AP :వైఎస్సార్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలో కారును కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురితో పాటు కంటైనర్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. కారులోని వ్యక్తులు బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల స్వస్థలం చక్రాయపేట మండలం కొన్నేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. కంటైనర్‌ డ్రైవర్‌ వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరో ప్రమాదంలో ఇద్దరు మృతి: దువ్వూరు మండలం చింతకుంట వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. కర్నూలు నుంచి తిరుపతికి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details