Paying Electricity Bills Through UPI Apps Have Stopped From This Month : ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యూపీఐ యాప్‌ల ద్వారా ఇప్పటి వరకు విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్న వినియోగదారులకు షాక్ తగిలింది. ఈ నెల నుంచి వాటి ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లించే సేవలు నిలిచిపోయాయి. ఇప్పటికే క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపు సేవలను ఆ యాప్‌లు నిలిపేశాయి. ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం) వినియోగదారులు మొబైల్ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని బిల్లులు చెల్లించాలని సూచించాయి.
TO Pay Current Bills UPI Not Works From This Month :ఆర్‌బీఐ మార్గదర్శకాలను అనుసరించి ఆయా చెల్లింపు సంస్థలు జులై ఒకటో తేదీ నుంచి బిల్లుల చెల్లింపు సేవలు నిలిపేశాయి. దీంతో విద్యుత్ వినియోగదారులు ప్రతినెలా బిల్లు చెల్లింపు కోసం ఆయా డిస్కం వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను వినియోగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిస్కంల యాప్/వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం, ఇతర యూపీఐ యాప్‌లను ఉపయోగించి బిల్లులు చెల్లించవచ్చు. అలాగే డెబిట్, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, వాలెట్స్, క్యాష్ కార్డ్స్ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది.
యూపీఐ లైట్ యూజర్లకు గుడ్ న్యూస్ - ఇకపై బ్యాలెన్స్ తగ్గినా నో వర్రీస్! - UPI Lite Automatic Replenishment
విద్యుత్ బిల్లులు ఇక ఇలా చెల్లించాలి
ఏపీసీపీడీసీఎల్:ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి central power యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. డిస్కం వెబ్‌సైట్ https://apcpdcl.in/ ద్వారా ఇక మీదట విద్యుత్ బిల్లులు చెల్లించాలి
ఏపీఈపీడీసీఎల్: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి eastern power యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. డిస్కం వెబ్‌సైట్ apeasternpower.com ద్వారా బిల్లులు చెల్లించాలి.
ఏపీఎస్‌పీడీసీఎల్: ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్ నెల్లూరు జిల్లాల పరిధిలో వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి southern power యాప్/వెబ్‌సైట్ www.apspdcl.in ద్వారా బిల్లులు చెల్లించాలి.
క్రెడిట్ కార్డ్‌తో యూపీఐ పేమెంట్స్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - Credit Cards For UPI Payments
No Electricity Bill Payments on UPI Apps :ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఈనెల నుంచి విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపేశారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ - టీజీఎస్‌పీడీసీఎల్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఈ విషయం తెలిపింది. ఆర్బీఐ మార్గదర్శకాల మేరకు జులై 1 నుంచి ఆయా సంస్థలు విద్యుత్ బిల్లుల చెల్లింపులను నిలిపివేసినట్లు వెల్లడించింది. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపుల మాదిరిగానే ఆయా యాప్స్ విద్యుత్తు బిల్లుల చెల్లింపు సేవలు నిలిపేసినట్లు పేర్కొంది. డిస్కం వెబ్‌సైట్ లేదా టీజీఎస్పీడీసీఎల్ మొబైల్ యాప్‌లో కరెంటు బిల్లులు చెల్లించాలని టీడీఎస్‌పీడీసీఎల్ వినియోగదారులకు సూచించింది.