ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే భేటీ - SAYAJI SHINDE MEET PAWAN KALYAN

వృక్ష ప్రసాద్​ యోజనను ఏపీలో ప్రారంభించాలని పవన్​ను కోరిన షిండే

senior_actor_sayaji_shinde_meets_ap_deputy_cm_pawan_kalyan.
senior_actor_sayaji_shinde_meets_ap_deputy_cm_pawan_kalyan. (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 9, 2024, 9:49 AM IST

Senior Actor Sayaji Shinde Meets AP Deputy CM Pawan Kalyan :డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినీ నటుడు షాయాజీ షిండే భేటీ అయ్యారు. హిందూ ఆలయాల్లో భక్తులకు ప్రసాదంతోపాటు ఒక మొక్క కూడా ఇవ్వాలని పవన్‌కు సూచించారు. షాయాజీ షిండే సూచనను స్వాగతించిన పవన్‌ సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వృక్ష ప్రసాద్ యోజనను (Vruksha Prasad Yojana) మహారాష్ట్రలో మూడు ప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నారని షిండే పవన్‌కు వివరించారు.

'నేను పవన్​ కల్యాణ్​​తో మాట్లాడాను. వృక్ష ప్రసాద్​ యోజనని ఇక్కడ ప్రారంభించాలని ఆయన్ని అడిగాను, దానికి ఉపముఖ్యమంత్రి అనుకూలంగా స్పందించారు. నేను మహారాష్ట్రలో కొన్ని దేవాలయాల్లో ఇప్పటికే మొక్కలు పంచుతున్నాను. త్వరలోనే ఏపీలో ప్రారంభిస్తాం.' - నటుడు షాయాజీ షిండే

హిందూ ఆలయాల్లో భక్తులకు ప్రసాదంతోపాటు ఒక మొక్క కూడా ఇవ్వటం ద్వారా పచ్చదనాన్ని పెంచే ఆలోచన చేస్తున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. షాయాజీ షిండే ఇచ్చిన సూచనను స్వాగతించిన పవన్ (Pawan Kalyan) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వృక్ష ప్రసాద్ యోజనను మహారాష్ట్రలో మూడు ప్రముఖ ఆలయాల్లో అమలు చేస్తున్నారని షిండే పవన్ కు వివరించారు. మరాఠీలో రాసుకున్న కవితను చదివి వినిపించగా దానిని పవన్ కళ్యాణ్ తెలుగులో అనువదించారు. అనంతరం షాయాజీ షిండే (Sayaji Shinde) మాట్లాడుతూ మనిషి మనుగడ ప్రకృతితో ముడిపడి ఉందన్నారు. ప్రపంచంలో ఏ మత ధర్మం అయినా ప్రకృతిని సంరక్షించుకుంటేనే భవిష్యత్తు అని పేర్కొన్నారు.
14 నుంచి 20 వరకు 'పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు' - పవన్ ఆదేశాలు

ఉపముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే రాష్ట్రంలో నగర వనాల అభివృద్దికి బాటలు వేస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో నిర్వీర్యమైన ప్రకృతి వనరులను తిరిగి తీసుకువస్తామని గతంలోనే తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని మెరుగ్గా తీర్తిదిద్దడమే తమ లక్ష్యమని, ప్రకృతి వనరుల్ని కాపాడి ముందు తరాలకు అందించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతుంది.

మానవ మనుగడకు ప్లాస్టిక్ శరాఘాతం - జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి : పవన్ కల్యాణ్ - Pawan Kalyan in Wildlife Program

ABOUT THE AUTHOR

...view details