Secunderabad Murder Accused Arrested : కదులుతున్న రైళ్లలో ప్రయాణికుల సెల్ఫోన్లే ఈ గ్యాంగ్ లక్ష్యం. ఎమరుపాటుగా ఉన్నవారి నుంచి కొట్టేసి పారిపోవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చాలారోజులుగా సికింద్రాబాద్ కేంద్రంగా చోరీలకు పాల్పడుతున్న ఈ గ్యాంగ్‌ను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. గత వారం క్రితం రేపల్లెకు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న అనిల్‌ను లక్ష్యంగా చేసుకొని దొంగలు అతని సెల్‌ఫోన్ (Phone) చోరీ చేశారు. వెంటనే అప్రమత్తమైన అనిల్ రైలు దిగి వారిని వెంబడించాడు. ఫోన్ ఇవ్వమని అడిగినందుకు ఈ గ్యాంగ్ సభ్యులు దారుణంగా చంపేశారు. ఈ కేసులో పోలీసులు మొత్తం ఐదుగురు నిందితుల ముఠాను అరెస్టు చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ తెలిపారు.
కళ్లెదుటే భర్తను హత్య చేసిన మేనల్లుడు - గుండెపోటుతో భార్య మృతి
Murder For A Cellphone : నంద్యాలకు చెందిన అనిల్ కుమార్ అనే యువకుడు చర్లపల్లిలో ఓ ల్యాబ్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత వారం రేపల్లె ట్రైన్లో వెళ్తుండగా ఈ గ్యాంగ్ అతని సెల్‌ఫోన్ కొట్టేసింది. సెల్‌ఫోన్ కోసం రైలు దిగి తన ఫోన్ ఇవ్వమని నిందితులను అడగగా రాహుల్ తన వెంట తీసుకువచ్చిన కత్తితో అతని పొత్తికడుపులో పొడవగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ గ్యాంగ్‌లో రాహుల్, సూరజ్, రవితేజ, లక్ష్మీనారాయణతో పాటు మరో మైనర్ బాలుడు కూడా ఉన్నాడు. అనిల్ మృతి చెందిన వెంటనే అతని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి జీహెచ్ఎంసీ చెత్త డబ్బా సమీపంలో మృతదేహాన్ని వదిలేసి వెళ్లారు.