ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దస్తగిరి ఫిర్యాదుపై కొనసాగిన రెండో రోజు విచారణ- పోలీసుల తీరులో సందేహాలు - ENQUIRY ON DASTAGIRI COMPLAINT

దస్తగిరి ఫిర్యాదుపై కడప జైల్లో రెండో రోజు విచారణ - విచారణకు హాజరైన జైలు గత సూపరింటెండెంట్‌ ప్రకాష్, డాక్టర్ చైతన్య రెడ్డి

Enquiry_on_Dastagiri_complaint
Enquiry_on_Dastagiri_complaint (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2025, 3:36 PM IST

Investigation in Kadapa Jail on Dastagiri Complaint:మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి ఇచ్చిన ఫిర్యాదుపై రెండో రోజు కొనసాగింది. కడప జైల్లో ఉండగా వివేక హత్య కేసులో ఐదో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించారన్న ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. న్యాయవాదితో విచారణ గదిలోకి లోపలికి వెళ్లిన చైతన్య రెడ్డి విచారణ అధికారి ముందు మాత్రం ఒక్కరే హాజరయ్యారు. కేవలం అరగంటలోపు మాత్రమే విచారణ పూర్తి చేసుకొని బయటికి వచ్చారు. 2023 నవంబర్ 28న కడప జైల్లో ఉన్న సమయంలో 20 కోట్లు ఆఫర్ చేశారని దస్తగిరి ఆరోపించారు. అంత కీలకమైన అంశాలపైన విచారణ అధికారి రాహుల్ కేవలం అరగంటలోపే విచారణ పూర్తి చేసి డాక్టర్ చైతన్య రెడ్డిని బయటకు పంపించడం పైన సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

విచారణకు హాజరైన జైలు గత సూపరింటెండెంట్‌:ఈ కేసులో గతంలో కడప జైలు సూపరింటెండెంట్​గా పనిచేసిన ప్రకాష్ కూడా విచారణకు హాజరయ్యారు. విచారణ అధికారి రాహుల్ శ్రీరామ ఎదుట హాజరయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జైలు సూపరింటెండెంట్​గా పనిచేస్తున్న ప్రకాశ్ ఇవాళ విచారణ హాజరయ్యారు. 2023 నవంబర్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరిని జైల్లో సూపరింటెండెంట్ ప్రకాష్ ఇబ్బంది పెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. డాక్టర్ చైతన్య రెడ్డి జైల్లో కూర్చున్న సమయంలో ఆయనకు అండగా నిలిచారనేది ప్రకాష్​పై అభియోగాలు. సీసీటీవీ ఫుటేజ్ మాయంపైనా విచారణ అధికారి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఎందుకు దస్తగిరినీ చీకటి గదిలో బంధించాల్సి వచ్చిందని ఆయన చేత ఎందుకు లెటర్ రాయించుకున్నవనే దానిపై విచారణ అధికారి ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

ABOUT THE AUTHOR

...view details