SEC Meeting on Telangana Panchayat Elections :పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా తయారీలో జిల్లా అధికార యంత్రాంగం నిమగ్నం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఆదేశించారు. కలెక్టర్లు, జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారులు, ఈఆర్ఓలతో పార్థసారథి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించిన అసెంబ్లీ ఓటరు జాబితాల ఆధారంగా పంచాయతీలు, వార్డుల వారీగా సిద్ధం చేయాలని తెలిపారు. సెప్టెంబరు 6 నాటికి ముసాయిదా ఓటర్ల జాబితాలు తయారు చేసి, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి సూచనలు స్వీకరించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు.
పంచాయతీ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్దం చేయండి - అధికారులకు ఎస్ఈసీ ఆదేశం - SEC Meeting on Panchayat Elections
Telangana Panchayat Elections : మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగరా మోగనుంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితాను తయారు చేయాలని అధికారులకు ఈసీ ఆదేశాలిచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం పంపిన అసెంబ్లీ ఓటరు జాబితాల ఆధారంగా పంచాయతీలు, వార్డుల వారీగా సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు.
Published : Aug 29, 2024, 7:17 PM IST
ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులన్నీ జాగ్రత్తగా సీఈసీ నిబంధనల మేరకు పూర్తి చేసి సెప్టెంబరు 21న తుది జాబితా ప్రచురించాలని పార్థసారథి ఆదేశించారు. ఓటరు జాబితా సిబ్బంది తర్వాత వార్డుల వారీగా పోలింగ్ సిబ్బంది నియామకం, శిక్షణ తదితర అంశాలుంటాయని వివరించారు. ఎన్నికల అక్రమాలపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు తయారు చేసిన గ్రీవెన్స్ మాడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సులో పంచాయతీ రాజ్ కార్యదర్శి లోకేశ్ కుమార్, కమిషనర్ అనిత రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.