ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ.లక్ష లంచం తీసుకుని - తాత్కాలిక పారిశుద్ధ్య ఉద్యోగాలిచ్చిన వైసీపీ నేతలు - Municipal Workers Issue in Kurnool

Sanitation Workers Demand Resignation of Kurnool Municipal Mayor : దొంగే దొంగ దొంగ అని అరచినట్టుంది కర్నూలు నగరపాలక సంస్థలో పరిస్థితి. నాటి జగన్ పాలనలో లంచాలు మింగి తాత్కాలిక ఉద్యోగులు మంజూరు చేసిన వైఎస్సార్సీపీ నేతలు ఇప్పుడు కాలపరిమితి పూర్తయ్యాక, ఉద్యోగుల స్థితికి అధికార పార్టీ కారణమంటూ మొసలు కన్నీరు కారుస్తున్నారు.

municipal_workers_issue_in_kurnool_district
municipal_workers_issue_in_kurnool_district (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 7:51 PM IST

Updated : Aug 20, 2024, 8:04 PM IST

Municipal Workers Issue in Kurnool District :అవినీతి మేయర్​ను రాజీనామా చెయ్యాలంటూ పారిశుద్ధ్య కార్మికులు ధ్వజమెత్తారు. ఉద్యోగాల ఎర వేసి, అధికారం అండతో పేదవారి నుంచి లక్షలు కాజేశారని బాధితులు వాపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే!

కర్నూలు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికుల నియామకంపై అధికార, విపక్ష పార్టీల మధ్య వివాదం చెలరేగింది. వైఎస్సార్సీపీ హయాంలో పారిశుద్ధ్య కార్మికులను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. గతేడాది మే నెలలో ఒక్కొక్కరి నుంచి లక్ష రూపాయలు తీసుకుని వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు 180 మందిని నియమించుకున్నారు.

ఈ ఏడాది మే నెల వరకు వీరితో పని చేయించుకుని కౌన్సిల్​లో తీర్మానం చేసి కార్మికులను పక్కన పెట్టేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో 189 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ఎవర్నుంచీ డబ్బులు తీసుకోకుండానే సిబ్బందిని నియమించారు. తాము చెల్లించిన డబ్బు తిరిగివ్వాలంటూ పారిశుద్ధ్య కార్మికులు మేయర్, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను నిలదీస్తున్నారు. ఏం చేయాలో దిక్కు తోచని మేయర్, వైఎస్సార్సీపీ కార్పొరేట్లు దొంగే వేరొకరిని దొంగ అన్నట్లు ఈ నెపాన్ని కూటమి నేతలపై నెడుతూ విమర్శల దాడి చేస‌్తున్నారు. దీనిపై తెలుగుదేశం కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటంతో పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎవరి వద్ద డబ్బులు తీసుకోకుండా సిబ్బందిని నియమించారు. గతంలో డబ్బులు చెల్లించి పనిలోకి వచ్చిన పారిశుద్ధ్య కార్మికులు వైఎస్సార్సీపీ మేయర్, కార్పొరేటర్లను నిలదీస్తున్నారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచక మంత్రి టీజీ భరతే దీని కంతటికీ కారణమని,మేయర్ సహా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మీడియాకు తమ బాధను వెల్లగక్కారు.'- బాధితులు

పరిహారం ఇవ్వకుండా జాప్యం - ఇబ్బందుల్లో పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు - No Compensation Sanitation Families

వైఎస్సార్సీపీ మేయర్​కు కమీషన్​ తీసుకోవడం పట్ల ఉన్న శ్రద్ద ప్రజలకు సేవ చేయడంలో లేదని మున్సిపల్ కార్మికుల ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కూటని ప్రభుత్వం వచ్చాకే కనీస సహాయం అందుతుందని ఓ మహిళ తెలిపారు. పేద పారిశుద్ధ్య కార్మికుల వద్ద లక్షలు వసూలు చేసిన వారి నుంచి డబ్బులు కక్కిస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. బాధిత కార్మికులు తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు.

ఎనిమిది నెలలుగా జీతాల్లేవు- పండుగ నాడు కూడా పస్తులే : పారిశుద్ధ్య కార్మికులు - muncipal workers agitation

Last Updated : Aug 20, 2024, 8:04 PM IST

ABOUT THE AUTHOR

...view details