ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వీడిన ఫ్యామిలీ డెత్ మిస్టరీ - గ్యాస్‌ గీజరే ముగ్గురి మృతికి కారణం! - SANATHNAGAR FAMILY DEATH MYSTERY - SANATHNAGAR FAMILY DEATH MYSTERY

Sanathnagar Family Death Mystery : తెలంగాణ రాజధాని హైదరాబాద్​ సనత్​నగర్​లోని జెక్​ కాలనీలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు టాయిలెట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు కొంత పురోగతి సాధించారు. తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందడానికి కారణం టాయిలెట్లో విషవాయువులు పీల్చడమేనని వైద్యుల ప్రాథమిక నిర్ధారణలో తేలినట్లు సనత్​నగర్​ ఇన్​స్పెక్టర్​ కె. శ్రీనివాసులు తెలిపారు.

Sanathnagar Family Death Mystery
Sanathnagar Family Death Mystery (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 23, 2024, 4:16 PM IST

Sanathnagar Family Death Mystery Solved :తెలంగాణ రాజధానిహైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్‌లో ఉన్న జెక్‌కాలనీలో ఆదివారం బాత్రూంలో తల్లి, తండ్రి, కుమారుడు మృతి చెందిన ఘటనలో ప్రమాదానికి గ్యాస్‌ గీజరే కారణమని భావిస్తున్నారు. అందులోని విషపూరితమైన వాయువు కార్బన్‌ మోనాక్సైడ్‌ను పీల్చినందునే ముగ్గురు మరణించి ఉంటారని వైద్యుల ప్రాథమిక నిర్ధారణలో తేలినట్లు సనత్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. శ్రీనివాసులు తెలిపారు.

ఇదీ జరిగింది :సిగ్నోడ్‌ ట్రాన్సిస్ట్‌ ప్యాకింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థలో బిజినెస్‌ హెడ్‌గా పనిచేసే ఆర్‌.వెంకటేష్‌ (59), ఆయన భార్య మాధవి (52), కుమారుడు హరికృష్ణ (25) జెక్‌ కాలనీలోని ఆకృతి ప్రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని తమ ఫ్లాట్‌ బాత్రూంలో ఆదివారం ఉదయం అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన విషయం విధితమే. మానసిక స్థితి సరిగాలేని కుమారుడు హరికృష్ణకు స్నానం చేయించేందుకు బాత్రూంలోకి వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

విషవాయువు పీల్చడంతోనే మరణించినట్లు :ఉదయం 8.30 గంటల ప్రాంతంలో పక్క ఫ్లాట్‌కు చెందిన వారు ఊరెళ్తుండగా ఈ ముగ్గురు వారికి వీడ్కోలు చెప్పారు. తర్వాత కొన్ని నిమిషాలకే కుమారుడికి స్నానం చేయించడానికి తల్లిదండ్రులిద్దరూ బాత్రూంలోకి వెళ్లి తలుపులు పెట్టారు. ఈ క్రమంలోనే గీజర్‌ నుంచి విడుదలైన కార్బన్‌ మోనాక్సైడ్‌ విషవాయువు పీల్చడంతో ఆ ముగ్గురూ స్పృహతప్పి క్షణాల్లోనే మరణించినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పోస్టుమార్టం రిపోర్ట్​ అందిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఇన్‌స్పెక్టర్‌ చెప్పారు.

ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి.. ఆమెకు రెండో పెళ్లి జరిగిన కొద్దిరోజులకే.. పిల్లల్ని చంపేసి..

Suspicious Case Registration :ఈ ఘటనపై అపార్ట్​మెంట్​ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. తొలుత ఎలక్ట్రిక్​ షాక్​తో మృతి చెందినట్లు పోలీసులు భావించారు. కానీ అలాంటి ఆనవాళ్లు ఏవీ లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్​ టీమ్​ సాయంతో ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్​కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందడంతో అపార్ట్​మెంట్​ వాసులు, స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

అప్పుల కోసం ఇంట్లో గొడవ- భార్యాపిల్లలను చంపేసిన పోస్ట్​మ్యాన్- ఆపై సూసైడ్!

సిమెంట్​ ట్యాంకర్​ను ఢీకొట్టిన ఆటో- ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details