ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రయాణికుల్లో గందరగోళం - స్టేషన్‌లో నిలిచిన రైలు, ఏమైందంటే? - SAINAGAR SHIRDI EXPRESS STOPPED

జనవరి 1 నుంచి రైలు షెడ్యూల్‌లో మార్పుల కారణంగా ప్రయాణికుల్లో గందరగోళం - సమయానికి రైలును అందుకోలేకపోయిన ప్రయాణికులు

Sainagar Shirdi Express Train Stopped Due To Changes Schedule
Sainagar Shirdi Express Train Stopped Due To Changes Schedule (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 6, 2025, 10:44 AM IST

Sainagar Shirdi Express Train Stopped Due To Changes Schedule :రైలు షెడ్యూల్‌లో మార్పుల కారణంగా ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంది. దీంతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సుమారు 3 గంటలపాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనవరి 1 నుంచి కాకినాడ పోర్టు- సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ షెడ్యూల్​ను​ అధికారులు మార్పు చేశారు. మార్పుచేసిన సమయం ప్రకారం ఈరోజు(సోమవారం) ఉదయం 5 గంటలకే కాకినాడ నుంచి రైలు బయల్దేరింది. అయితే గతంలో ఇదే రైలు ఉదయం 6 గంటలకు బయల్దేరేది.

ప్రయాణికుల్లో గందరగోళం - రైల్వే స్టేషన్‌లో నిలిచిన రైలు, ఏమైందంటే? (ETV Bharat)

రైలు సమయంలో మార్పు జరగడంతో కాకినాడ పోర్టు, సామర్లకోట స్టేషన్లలో పలువురు ప్రయాణికులు రైలును అందుకోలేకపోయారు. అయితే సమయం మార్పుపై ముందుగానే సమాచారం ఇచ్చామని రైల్వే సిబ్బంది చెబుతున్నారు. చివరికి ప్రయాణికుల ఫిర్యాదుతో రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్‌లో సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. కాకినాడ, సామర్లకోటలో ఉన్న ప్రయాణికులను ప్రత్యేక రైలు శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో రాజమహేంద్రవరానికి తరలించారు. ప్రయాణికులు చేరుకున్నాక సాయినగర్‌ షిర్డీ ఎక్స్‌ప్రెస్‌ అక్కడి నుంచి గమ్యస్థానానికి బయల్దేరింది.

ABOUT THE AUTHOR

...view details