ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభావతికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు' - ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన RRR

రఘురామ కస్టోడియల్ టార్చర్‌ కేసులో జీజీహెచ్‌ మాజీ సూపరింటెండెంట్ ప్రభావతి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ - తమను ఇంప్లీడ్ చేయాలని గుంటూరు జిల్లా కోర్టులో రఘురామ పిటిషన్

RRR_Custodial_Torture_Case
RRR Custodial Torture Case (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2024, 3:31 PM IST

RRR Custodial Torture Case: మాజీ ఎంపీ, ప్రస్తుత ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు హత్యాయత్నం కేసుకు సంబంధించి ఆయన తరపున న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారణ సమయంలో రఘురామపై జరిగిన హత్యాయత్నంలో అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి కూడా హత్యాయత్నంలో భాగస్వాములు అయ్యారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకృష్ణరాజును పరీక్షించిన వైద్య బృందం ఆయన కాలుపై బలమైన దెబ్బలు ఉన్నాయని నివేదిక ఇచ్చారని న్యాయవాది తెలిపారు.

ఆయన రెండు కాళ్లకు బలమైన దెబ్బలతో పాటు వాచిపోయి ఉన్నాయని పిటిషనర్ వెల్లడించారు. అప్పటి ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి వేసిన ముందస్తు బెయిల్‌పై మంగళవారం గుంటూరు జిల్లా కోర్టులో విచారణకు రాగా, ఈ కేసులో తమను ఇంప్లీడ్ చేయాలని రఘురామకృష్ణరాజు పిటిషన్ వేశారు. రఘురామ తరఫున హైకోర్టు న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ పిటిషన్ వేశారు. వైద్య బృందం ఇచ్చిన నివేదికను టాంపరింగ్ చేశారని, అందుకు భిన్నంగా నివేదిక ఇవ్వడంలో ప్రభావతి కీలక పాత్ర పోషించారని ఆరోపించారు.

బైపాస్ సర్జరీ చేయించుకున్నా అని చెప్పినప్పటికీ గుండెలపై కూర్చొని బాధారని తెలిపినప్పటికీ ప్రభావతి ఈ అంశాన్ని తొక్కి పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందువలన ప్రభావతికి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని పేర్కొంటూ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇంప్లీడ్ పిటిషన్‌ను అనుమతించాలని న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ కోరారు.

Former CID ASP Vijay Pal Remand : మరోవైపు రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విశ్రాంత ఏఎస్పీ విజయ్ పాల్‌కు ఇప్పటికే కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందన విషయం తెలిసిందే. విజయపాల్​ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. రఘురామకృష్ణరాజును హింసించిన కేసులో ఇప్పటివరకూ 27 మందిని విచారించారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి, అప్పటి సీఎం వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు నమోదు చేసిన సీఐడీ 2021 మే 14వ తేదీన అరెస్ట్ చేసింది. గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి విచారణకు తరలించిన సమయంలో హత్యాయత్నం చేశారని అప్పట్లో రఘురామకృష్ణరాజు కోర్టుకు నివేదించారు. కానీ వైద్యులు ఇచ్చిన తప్పుడు నివేదికలతో బాధ్యులపై ఎలాంటి అప్పట్లో ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

'ఏం రాజు గారూ ఇలా చేశారు' - విరిగిపోయిన మంచాన్ని చూసి ఏమీ ఎరగనట్లు అడిగారు

"RRR కస్టోడియల్ హింస కేసు" - సీఐడీ మాజీ ఏఎస్పీ విజయ్‌పాల్​కు రిమాండ్

"సీఐడీ కస్టడీ మిస్టరీ" - ఈ కేసులో పెద్ద చేపలు త్వరలో తెరపైకి : RRR

ABOUT THE AUTHOR

...view details