Rowdy Sheeter Halchal in Central Prison Visakhapatnam : విశాఖపట్నం కేంద్ర కారాగారం ప్రధాన ద్వారం వద్ద ఓ రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. పలు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్న గుర్రాల సాయి (34) అనే వ్యక్తి పోలీసు అధికారులతో దురుసుగా ప్రవర్తించాడు. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమంలో చర్చనీయాంశమైంది.
విశాఖ కేంద్ర కార్యాలయం వద్ద పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న గుర్రాల సాయి ఆర్మ్ రిజర్వ్ పోలీసులపై జూలుం ప్రదర్శించాడు. సోమవారం (sep 9) కోర్టులో హాజరు పరిచి తిరిగి వస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జైల్లోకి వెళ్లకుండా ప్రధాన ద్వారం వద్దనే పోలీసులపై ఆగ్రహంతో ఊగిపోయాడు. ఈ విషయం జైలు సూపరింటెండెంట్ దృష్టికి వెళ్లింది. ఈ విషయంలో నిందితుడిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రౌడీషీటర్లు పోలీసులతోనే దురుసుగా ప్రవర్తిస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. పోలీసులతో నిందితుడు ప్రవర్తించిన తీరు వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.