ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్ రెడ్డీ నోరు అదుపులో పెట్టుకో - నేనేంటో 5 ఏళ్లలో నువ్వే చూశావ్' - AB VENKATESWARA RAO WARNS TO JAGAN

వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌కు విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు హెచ్చరిక

AB_Venkateswara_Rao
AB Venkateswara Rao (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 22, 2024, 12:14 PM IST

AB Venkateswara Rao Warns to YS Jagan: వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై విశ్రాంత ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్‌ జగన్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకో, మాట సరిచేసుకో, భాష సరిచూసుకో అంటూ హెచ్చరించారు. ఒకసారి ప్రజల విశ్వాసం కోల్పోయినా, నోరు జారినా వాటిని ఎన్నటికీ తిరిగి పొందలేరని, జగన్ మోహన్ రెడ్డిలా కుసంస్కారంతో తాను మాట్లాడనని తెలిపారు. తెరవెనుక బాగోతాలు తాను నడపనంటూ ఏబీ వెంకటేశ్వరరావు మండిపడ్డారు.

YS Jagan Comments on ABV: ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్‌ లాంటి కొంతమంది విశ్రాంత ఐపీఎస్‌ అధికారుల్ని సీఎం చంద్రబాబు జట్టుగా తయారుచేశారని ఆరోపించారు. వీరంతా జిల్లాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని, వేదికలపై గట్టిగా నిలదీస్తున్న వారిపేర్లను టీడీపీ, ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి సేకరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్ జగన్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా ఏబీ వెంకటేశ్వరరావు కౌంటర్‌ ఇచ్చారు.

నేనేంటో 5 ఏళ్లలో నువ్వే చూశావ్:సర్వీసులో ఉన్నప్పుడు ఎన్నో ఘనతలు సాధించానని, జీవితంలో ఎవరి దగ్గరా చేయి చాచలేదని సగర్వంగా చెప్పగలనని ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. జగన్‌రెడ్డీ నీకు ఆ దమ్ముందా అంటూ ప్రశ్నించారు. హత్యలు చేసినవాళ్లను తాము అరెస్టు చేస్తే, హంతకులను నువ్వు వెనకేసుకొస్తున్నావని విమర్శించారు. తనను సాధించడం కోసం అధికారం వెనుక దాక్కొని అనేక ఆరోపణలు చేశావని, ఒక్క ఆరోపణ నిరూపించలేకపోయావని మండిపడ్డారు.

నిన్ను ఇక్కడ సీబీఐ బోనులో నుంచోబెడితే, లంచాలు తీసుకున్నావని అమెరికాలో కూడా కోర్టులకు ఈడుస్తున్నారని అన్నారు. తాను ఐపీఎస్‌ అధికారినై ప్రాణాలకు తెగించి దేశసేవ చేశానని, మరి నువ్వు ఏం చేశావని నిలదీశారు. అవినీతి కోసమే పుట్టావంటూ విమర్శించారు. ప్రజాజీవనంలో ఉన్నావు, తన పేరెత్తే ముందు, తన గురించి మాట్లాడేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకో అని హితవు పలికారు. విలేకర్ల సమావేశంలో బుధవారం తన పేరు ప్రస్తావించి నువ్వు వాడిన భాష సంస్కారహీనం అని తీవ్రస్థాయిలో ఏబీ వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు.

అన్యాయం, అణచివేతపై పోరాడుతూనే ఉంటా: రిటైర్డ్ ఐపీఎస్ ఏబీవీ - IPS ABV INTERVIEW

ABOUT THE AUTHOR

...view details