Reliance Energy Investment RS 65000 Crore in AP for Clean Energy Project :మంత్రి లోకేశ్ కృషితో రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రానుంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ ఎనర్జీ సంస్థ రూ. 65 వేల కోట్లతో సంసిద్ధతగా ఉంది. ఇవాళ సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. లోకేశ్ అమెరికా పర్యటనకు ముందు ముంబయిలో రిలయన్స్ సంస్థతో చర్చలు ఫలవంతమయ్యాయి. గుజరాత్ తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇంత పెద్దఎత్తున పెట్టుబడులకు సిద్ధమైంది.
సీఎం సమక్షంలో అవగాహన ఒప్పందం :ఏపీలో రిలయన్స్ సంస్థ 500 అధునాతన బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది. గత నెలలో రిలయన్స్ ఛైర్మన్ ముకేష్ అంబానీ, రిలయన్స్ క్లీన్ ఎనర్జీకి నేతృత్వం వహిస్తున్న అనంత్ అంబానీని లోకేశ్ ముంబైలో కలిశారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ రంగాలకు ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వారికి మంత్రి వివరించారు. రాష్ట్రంలో పెట్టబడులకు సంబంధించి అనంత్ అంబానీ, మంత్రి లోకేశ్ మధ్య అప్పుడే అవగాహన ఒప్పందం కుదిరింది.