ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బ్యాంక్​​లో బంగారం తాకట్టు పెడుతున్నారా? - ఈ రూల్స్​ తెలియాల్సిందే!

బ్యాంక్​లో తాకట్టు పెట్టిన బంగారం, డబ్బులు పోతే ఏం చేయాలి? - బ్యాంక్​లు తిరిగి మన సొమ్ము మనకు ఇస్తాయా?

bank_locker_rules
bank_locker_rules (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : 11 hours ago

RBI Rules and Regulations on Banks:ఏదైనా బ్యాంకులో చోరీ గాని అగ్నిప్రమాదం గాని జరిగి ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారం, నగదును నష్టపోతుంటారు. మరి బ్యాంకులు బాధ్యత వహిస్తాయా? లాకర్​లో ఉన్న వస్తువులు పోతే పరిహారం అందిస్తాయా? ఈ విషయాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్‌బీఐ నిబంధనలు ప్రకారం: ఏదైనా బ్యాంకులో దొంగతనం, అగ్నిప్రమాదం జరిగి ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి నష్టం జరిగితే బ్యాంకు ఇచ్చే పత్రాల ద్వారా (అప్రైజర్‌ విలువ కట్టిన పత్రాలు) వంద శాతం బీమా సౌకర్యం అందుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ధర ప్రకారం వాటికి బ్యాంక్​లు నష్టపరిహారాన్ని చెల్లిస్తాయి.

ఉదాహరణకు ఒక వ్యక్తి ఏదైనా బ్యాంక్​లో 40 గ్రాముల బంగారం తనఖా పెట్టి రూ.2 లక్షల అప్పు తీసుకున్నారు. సదరు బ్యాంకులో చోరీ జరిగి ఆ వ్యక్తి పెట్టిన 40 గ్రాములు దొంగతనానికి గురైతే అతడి వద్ద ఉన్న పత్రాల ఆధారంగా ఆ బంగారానికి సంబంధించిన మొత్తం నగదును మార్కెట్ ధర ప్రకారం బ్యాంకు చెల్లిస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకుకు సంవత్సరానికోసారి బీమా చేయిస్తారు. అది బ్యాంకు ఆ సంవత్సరంలో జరిపిన రుణ లావాదేవీలతో పాటు నగదుపై ఆధారపడి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని బ్యాంకర్లు చెబుతున్నారు.

'బంగారు' తల్లీ కనికరించమ్మా - కుమార్తె ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా

వ్యక్తిగత లాకర్లలోని సొమ్ముకు ఖాతాదారులదే బాధ్యత : వ్యక్తిగత లాకర్లలో పెట్టే విలువైన నగలు, పత్రాలు, నగదు విషయంలో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యత మాత్రం ఖాతాదారులే భరించాలి. లాకర్లలో ఖాతాదారులు ఏం పెడుతున్నారనేది బ్యాంకు అధికారులు చూడరు. అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి లాకర్లలో ఉన్న నగదు, పత్రాలు, నగదు నష్టపోతే దానికి బ్యాంకు బాధ్యత వహించదు. వ్యక్తిగత లాకర్లలో నగదు, నగలు పెట్టకపోవడమే మంచిది. ఏదైనా ప్రమాదం జరిగితే మనం బాధ్యత వహించాలి తప్పితే బ్యాంకులకు సంబంధం ఉండదని అధికారులు చెప్తున్నారు.

ఎస్‌బీఐ బ్యాంకులో చోరీ : ఇటీవల తెలంగాణలోని వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ఎస్‌బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. కొంమంది దొంగలు అర్ధరాత్రి బ్యాంకు లాకరును పగులగొట్టి 19 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ విషయం తెలిసి బాధితులు ఆందోళనకు గురయ్యారు. మీ సొమ్ము ఎక్కడికి పోదని తాము భరోసా అని బ్యాంకర్లు చెబుతున్నా వారికి నమ్మకం రావట్లేదు. బ్యాంకు చుట్టూ తిరుగుతూ అధికారులను వేడుకుంటున్నారు.

రాయపర్తి ఎస్‌బీఐలో బ్యాంకులో 3 సెఫ్టీ లాకర్లు ఉన్నాయి. అందులోని ఒక లాకర్‌లో 500 మందికి సంబంధించిన తాకట్టు పెట్టిన బంగారం ఉంది. దొందసు అందులో నుంచి 19 కిలోల బంగారాన్ని దొంగిలించారు. దీని విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుంది. నలుగురు వ్యక్తులు దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో వచ్చిన వీరు బ్యాంకులోకి ప్రవేశించి రెండు గంటలపాటు ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీకి పాల్పడిన నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, అందుకు ప్రత్యేక బృందాన్ని నియమించామని సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు.

ఒక్కో అంతస్తుకు రూ. 5 లక్షలు - అక్రమ నిర్మాణాలకు గ్రీన్​ సిగ్నల్​

హమ్మయ్యా అవి పులి పిల్లల కాదు- ఊపిరి పీల్చుకున్న రైతులు

ABOUT THE AUTHOR

...view details