ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాధ్యతలు చేపట్టాక తొలిసారి నియోజకవర్గానికి నేతలు - టపాసులు కాలుస్తూ, గజమాలలతో శ్రేణుల స్వాగతం - Ranges Welcome To Alliance Leaders

Ranges Warm Welcome to Ministers And MLAs: బాధ్యతలు చేపట్టాక తొలిసారి నియోజకవర్గానికి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఆనందంతో అభిమానులు బైకులు, కార్లతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శ్రేణులు టపాసులు కాల్చుతూ భారీ గజమాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

Ranges Warm Welcome to Ministers And MLAs
Ranges Warm Welcome to Ministers And MLAs (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 24, 2024, 8:46 AM IST

Ranges Warm Welcome to Ministers And MLAs in Constituencies : బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వెళ్లిన మంత్రులు, ఎమ్మెల్యేలకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితకు పుట్టపర్తి జిల్లా పెనుకొండలో కూటమి అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు సవితకు గౌరవ వందనం చేశారు. ఎన్డీఏ కూటమి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందువరుసలో ఉంటుందని సవిత అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు సంక్షేమం, అభివృద్ధిపై నిరంతం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చేనేతకు పూర్వ వైభవం తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తానన్నారు. చేనేత బతుకుల్లో అభివృద్ధి వెలుగులు వికసిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.

అనంతపురానికి కూలీనే- బాధ్యతలు చేపట్టాక జిల్లాకు వచ్చిన పయ్యావులకు బ్రహ్మరథం - People Welcome to Payyavula Keshav

తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఎమ్మెల్యే బత్తుల బలరాకృష్ణకు కూటమి అభిమానులు ఘనస్వాగతం పలికారు. బైకులు, కార్లతో ర్యాలీ నిర్వహించారు. తర్వాత కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహస్వామిని బలరామకృష్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాకినాడలో పర్యటించారు. ఆయనకు అధికారులు బొకేలు ఇచ్చి స్వాగతం పలికారు. కూటమి అభిమానులు కార్యకర్తలు మంత్రి సుభాష్​ను కలిసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుకు కూటమి అభిమానులు టపాసులు కాల్చి స్వాగతం పలికారు. ఎన్టీఆర్​ విగ్రహానికి కళావెంకట్రావు పూలమాల వేశారు. తర్వాత కూటమి నాయకులు ఆయనను సత్కరించారు. ఎలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ తెలిపారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణం చేసిన తరవాత మొదటిసారిగా ఆదివారం నియోజకవర్గానికి వచ్చారు. ఎలమంచిలి, రాంబిల్లి మండలాల పరిధిలో ర్యాలీ నిర్వహించి అచ్యుతాపురం చేరుకున్నారు. ఈ మార్గంలో ఎమ్మెల్యేను కార్యకర్తలు, నాయకులు గజమాలలతో సత్కరించి స్వాగతం పలికారు.

బాబాయి, అబ్బాయిలకు సిక్కోలు వాసుల నీరాజనం - Atchannaidu Ram Mohan Naidu

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చిన జిల్లాకు రావడంతో కూన రవికుమార్​కు తెలుగుదేశం శ్రేణులు విశాఖ విమానాశ్రయంలో బ్రహ్మరథం పట్టాయి. విమానాశ్రయం నుంచి ర్యాలీగా శ్రీకాకుళం నగరానికి చేరుకున్నారు. సింహద్వారం వద్ద దివంగత కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు, బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. విశాఖ నుంచి ఆమదాలవలస చేరుకున్న కూనరవికుమార్​కు అక్కడి నాయకులు, కార్యకర్తలు టపాసులు కాల్చి భారీ గజమాలతో సత్కరించారు.

మంత్రిగా తొలిసారి పెనుకొండకు సవిత - ఘనస్వాగతం పలికిన కూటమి శ్రేణులు - Savitha Grand Welcome in Penukonda

ABOUT THE AUTHOR

...view details