New Year 2025 Liquor Sales in AP : న్యూ ఇయర్ వేడుకలు అంటేనే విందు, వినోదానికి పెట్టింది పేరు. ఇప్పటికే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మద్యం విక్రయాల్లో రికార్డులు సృష్టించిన మద్యం ప్రియులు. తాజాగా మరో మైలురాయిని చేరుకున్నారు. రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 31వ తేదీ ఒక్క రోజే మందుబాబులు దాదాపు రూ.200 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగేశారు. 60 లక్షల మద్యం క్వార్టర్లు, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు.
మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బుల్లో నిర్దేశిత సమయం కంటే అదనంగా మరో 2 గంటలపాటు విక్రయాలకు ఈ సారి ప్రభుత్వం అనుమతిచ్చింది. మొత్తంగా 14 గంటలపాటు మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ లెక్కన గంటకు సగటున దాదాపు రూ.14.28 కోట్ల విలువైన మద్యం అమ్మారు. నూతన సంవత్సర వేడుకల కోసం సాధారణంగా మూడు రోజుల ముందు నుంచే డిపోల నుంచి మద్యాన్ని దుకాణాలకు చేరవేస్తుంటారు.
అందులో భాగంగా ఈ సారి డిసెంబర్ 30, 31వ తేదీల్లో రూ.331.85 కోట్ల విలువైన మద్యం దుకాణాలకు చేరింది. 4,10,192 కేసుల ఐఎంఎల్, 1,61,241 కేసుల బీర్లు చేరాయి. అందులో 2.50 లక్షల ఐఎంఎల్ కేసులు, 75,000ల బీరు కేసులు 31వ తేదీ ఒక్క రోజు అమ్ముడైనట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దాని విలువ దాదాపు రూ.200 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా రోజుకు రూ.80 కోట్ల రూపాయల విలువైన మద్యంను డిపోల నుంచి దుకాణాలకు తరలిస్తారు. కానీ నూతన సంవత్సరం సందర్భంగా అందుకు రెండు రెట్లు అధికంగా మద్యాన్ని తరలించారు.
మందుబాబులకు గుడ్న్యూస్ - భారీగా తగ్గిన మద్యం ధరలు
మందుబాబులకు గుడ్న్యూస్ - నాణ్యతపై దృష్టి - ఎంఆర్పీ మించి అమ్మితే 5లక్షలు ఫైన్