ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సత్యం పలికించే బండ - ఈ మిస్టీరియస్ టెంపుల్ ఎక్కడుందంటే? - Rajanala Banda Temple Story

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 10:58 AM IST

Rajanala Banda Temple Story : అత్యంత మహిమాన్వితమైన ఆలయాలకు పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలోనే సత్యప్రమాణాల క్షేత్రంగా ఓ ఆలయం పేరుగాంచింది. అందుకే న్యాయం కోసం భక్తులు ఇక్కడికి వస్తుంటారు. మరి ఇదెక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Rajanala Banda Temple Story
Rajanala Banda Temple Story (ETV Bharat)

History of Rajanala Banda Temple : మన రాష్ట్రం ఆధ్యాత్మికతకు నిలయం. ఇక్కడ పురాతన చారిత్రక కట్టడాలు ఎన్నో ఉన్నాయి. ఔరా అనే అనేక కళాకృతులు గల ఆలయాలు నేటికీ అనేకం ఉన్నాయి. కొన్ని చరిత్రకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. అమూల్యమైన దేవాలయాలు మనకు తరగని సంపద. ముఖ్యంగా కొన్ని ఆలయాల్లో దేవుడి మహిమల గురించి కొకొల్లలుగా ప్రచారాలు ఉన్నాయి. అలాంటి ఓ ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rajanala Banda Utsavalu 2024 :దొంగతనాలు, వివాదాలు, గొడవలు జరిగితే ఎవరైనా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేస్తారు. లేదంటే పెద్ద మనుషుల దగ్గర పంచాయితీ పెట్టి ఆ ఆ సమస్యను పరిష్కరించుకుంటారు. కానీ అక్కడి వారు మాత్రం రాజనాల బండకు తొక్కితే అది పరిష్కారమవుతాయని నమ్మిక. అంతటి మహిమ గల బండ చిత్తురు జిల్లాలో ఉంది. ఈ ఆలయం చౌడేపల్లె మండలం వెంగళపల్లె పంచాయతీ పరిధిలోని దాసరయ్యగారిపల్లెకు సమీపంలో ఉంది. బండకు తూర్పున కొండపై లక్ష్మీనరసింహస్వామి, బండపై వీరాంజనేయస్వామి, ఆయనకు నైరుతిలో మహేశ్వరుడు లింగస్వరూపుడై నిలిచారు. ఈ క్షేత్రం శ్రీకృష్ణదేవరాయుల కాలంలో వెలిసినదని పురాణాలు చెబుతున్నాయి.

ఉట్లోత్సవానికి సిద్ధంచేసిన స్తంభాలు (ETV Bharat)

ప్రతి శనివారం ప్రమాణాలు :ఎవరైైనా వస్తువులు పోగొట్టుకున్న బాధితులు శనివారం ఆలయంలో పేరు నమోదు చేయించుకుంటారు. మరుసటి శనివారం అనుమానితులను ఈ గుడికి తీసుకొస్తారు. ఆలయ పూజారులు వారందరిని విచారించి ఇక్కడ ప్రమాణం చేస్తే జరిగే అనర్థాలను వివరిస్తారు. అనంతరం వాయిదా ఇస్తారు. వాయిదా కాలంలో బాధితుని ఇంటి ఆవరణలో ఎక్కడో ఒకచోట పోయిన నగదు, వస్తువులు లభించడం విశేషం.

Rajanala Banda Anjaneya Swamy Temple :దాదాపు ఐదు వందల సంవత్సరాలుగా ఇక్కడ ఈ ఆచారం సాగుతుందని దేవాలయ అర్చకులు తెలిపారు. ప్రజలు ధర్మమార్గంలో నడవటానికి ఈ ఆలయం కీలక పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా ప్రతీ శనివారం తీర్పు కోసం పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివస్తుంటారని వారు వివరించారు.

నేటి నుంచి ఉత్సవాలు:ఏటా శ్రావణ మాసం చివరి శని, ఆదివారాల్లో ఉత్సవాలు జరగడం సంప్రదాయం. శనివారం ఉదయాన్నే భక్తులు అధిక సంఖ్యలో కొండ చేరుకుంటారు. అక్కడ వెలసిన లక్ష్మీనరసింహస్వామికి ఉపవాస దీక్షలు చెల్లిస్తారు. ఆదివారం వీరాంజనేయస్వామికి పూజలు ఉట్లోత్సవం నిర్వహిస్తారు. ఈ బండ టీటీడీ పరిధిలోకి వెళ్లడంతో ఈ ఏడు టీటీడీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.

వినాయకుడిపైకి డైరెక్ట్​గా సూర్యకిరణాలు! ఈ అద్భుతమైన టెంపుల్ ఎక్కడుందంటే? - Special Ganesh Temple

ఆ గుడిలో అంజన్నకు చిటికెన వేలు ఉండదు- అలా అని చెక్కితే రక్తమే రక్తం! - Hanuman Special Temple

ABOUT THE AUTHOR

...view details