Rain Alert in Andhra Pradesh:నైరుతి రుతుపవనాలతో రెండు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ ఎండీ కూర్మనాథ్ వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, కోస్తాంధ్ర, మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం, కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలో మరొక ఆవర్తనం విస్తరించి ఉందన్నారు.
ఈ రెండ్రోజులు వర్షాలతో జాగ్రత్త!- విపత్తుల సంస్థ సూచన - RAIN ALERT IN ANDHRA PRADESH - RAIN ALERT IN ANDHRA PRADESH
Rain Alert in Andhra Pradesh: రాష్ట్రంలో రెండురోజులపాటు ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ ఎండీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
![ఈ రెండ్రోజులు వర్షాలతో జాగ్రత్త!- విపత్తుల సంస్థ సూచన - RAIN ALERT IN ANDHRA PRADESH Rain_Alert_in_Andhra_Pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/05-06-2024/1200-675-21645361-thumbnail-16x9-rains-alert-in-andhra-pradesh.jpg)
Rain_Alert_in_Andhra_Pradesh (ETV Bharat)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 5, 2024, 7:58 PM IST
ఈ రెండ్రోజులు వర్షాలతో జాగ్రత్త!- విపత్తుల సంస్థ సూచన (ETV Bharat)
ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని వాతావరణ శాఖ సూచించింది. ఈరోజు కాకినాడ జిల్లా శంఖవరంలో అత్యధికంగా 47.5మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడిలో 33.5మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా దంచికొట్టిన వాన - పొంగుతున్న వాగులు, వంకలు - Heavy rains in AP