ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది- అమరావతి రైల్వే లైన్‌ కదలింది! - Gazette for Amaravati Railway Line - GAZETTE FOR AMARAVATI RAILWAY LINE

Land Acquisition For Amaravati Railway Line: విజయవాడ - గుంటూరు నగరాల్ని అమరావతితో అనుసంధానించే రైల్వే లైన్‌ ఎట్టకేలకు కదిలింది. ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా నంబూరు వరకూ 56 కిలో మీటర్ల కొత్త లైన్‌ ఏర్పాటుకు రైల్వేశాఖ సిద్ధమైంది. భూసేకరణకు నోటిఫికేషన్‌ కూడా ఇచ్చింది.

Land Acquisition For Amaravati Railway Line
Land Acquisition For Amaravati Railway Line (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 8:12 AM IST

Land Acquisition For Amaravati Railway Line :అమరావతి పునర్నిర్మాణాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాధాన్యంగా తీసుకున్న వేళ రైల్వేశాఖ కూడా కదిలొస్తోంది. అమరావతి రైల్వే లైన్‌ భూసేకరణకు గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు విషయంలో జగన్‌ మోహన్ రెడ్డిప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గత ఐదేళ్లూ ఉలుకుపలుకూ లేకుండా ఉన్న రైల్వేశాఖ ఇప్పుడు మేల్కొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వాలి. భూసేకరణ వ్యయం భరించాలనే కొర్రీలతో కాలయాపన చేసిన రైల్వేశాఖ ఇప్పుడవేమీ లేకుండా పూర్తిగా తమ నిధులతోనే నిర్మాణానికి ముందుకొచ్చింది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య భూసేకరణకు వీలుగా, దీనిని ప్రత్యేక ప్రాజెక్ట్‌గా గుర్తిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అమరావతిలో విశ్వవిద్యాలయాలకు దారి చూపండి - ప్రభుత్వానికి సహకరిస్తామని యాజమాన్యాల భరోసా - Universities at Amaravati

New Railway Lines in AP :విజయవాడ, గుంటూరు రైల్వే లైన్లకు రాజధాని ప్రాంతాన్ని అనుసంధానం చేసేలా 2017-18లోనే కొత్త రైల్వే లైన్‌ మంజూరైంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56 కిలోమీటర్ల మేర డబుల్‌ లైన్, అమరావతి-పెదకూరపాడు మధ్య 24న్నర కిలోమీటర్ల సింగిల్‌ లైన్, సత్తెనపల్లి-నరసరావుపేట మధ్య 25 కిలో మీటర్ల సింగిల్‌ లైన్‌ కలిపి మొత్తం 106 కిలోమీటర్ల మేర కొత్తలైన్‌కు అప్పట్లోనే ఆమోదం లభించింది. కానీ, జగన్‌ అధికారంలోకి వచ్చాక అమరావతిని పాడుబెట్టడంతో రైల్వే లైన్ ప్రాజెక్టు అటకెక్కింది.

చంద్రబాబు మళ్లీ సీఎం కావడంతో రైల్వేశాఖలో కదలిక వచ్చింది. ఈ ప్రాజెక్టులో ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.53 కి.మీ. మేర డబుల్‌ లైన్‌ బదులుగా మొదట సింగిల్‌ లైన్‌ నిర్మాణానికి సిద్ధమైంది. ఈ లైన్‌కు కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఖమ్మం జిల్లాల పరిధిలో 450 హెక్టార్ల మేర భూసేకరణ చేయనుంది. సింగిల్‌ లైన్‌ నిర్మాణానికి, భూసేకరణకు కలిపి 2,600 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేసింది.

ఏపీ అంటే అమరావతి, పోలవరం- త్వరలో వీటిపై శ్వేతపత్రాలు: సీఎం చంద్రబాబు - CM Chandrababu Media Conference

ఈ కొత్తలైన్‌ విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో ఎర్రుపాలెం వద్ద మొదలై, అమరావతి మీదుగా గుంటూరు-విజయవాడ లైన్‌లోని నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరుల్లో 9 కొత్త స్టేషన్లు నిర్మించనున్నారు. వీటిలో పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరు పెద్దస్టేషన్లుగా, అమరావతిని ప్రధాన స్టేషన్‌గా నిర్మిస్తారు. ఈ లైన్‌లో భాగంగా కృష్ణా నదిపై కొత్తపేట-వడ్డమాను మధ్య 3 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మిస్తారు.

చెమ్మగిల్లిన చంద్రబాబు కళ్లు- మట్టిని ముద్దాడి అమరావతికి సాష్టాంగ వందనం చేసిన సీఎం - CM Chandrababu Visit Amaravati

ABOUT THE AUTHOR

...view details