Lok Sabha Elections 2024 : ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా, ఆర్‌ఎస్సెఎస్ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని, కాంగ్రెస అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. రాజ్యాంగంతోనే దేశంలో పేదలకు బలమైన శక్తి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం అనే పుస్తకం మాములు పుస్తకం కాదని, మహా మహా మేధావులు ఏళ్ల తరబడి కృషి చేసి దేశానికి రాజ్యాంగం అందించారని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్‌లో నిర్వహించిన జనజాతర సభలో పాల్గొన్నారు.
'అంబానీ-అదానీ నుంచి రాహుల్‌కు డబ్బు ట్రక్కులు'- మోదీ వ్యాఖ్యలపై గాంధీ ఫైర్ - Rahul Gandhi On PM Modi
ఈసందర్భంగా మాట్లాడుతూ విద్య, ఉద్యోగాలు, ఓటుహక్కు అన్నీ మనకు రాజ్యాంగం ద్వారానే వచ్చాయని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. రాజ్యాంగంతో పాటు రిజర్వేషన్లు కూడా రద్దు చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను విక్రయించి అన్నీ ప్రైవేటుపరం చేస్తున్నారని, క్రమంగా ప్రైవేటీకరణ పెంచి రిజర్వేషన్లు రద్దు చేయాలనేది బీజేపీ ఆలోచన అని పేర్కొన్నారు.
దేశంలో 90 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం దక్కటం లేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల ప్రజలు ఎంతమంది ఉన్నారో ముందు లెక్కలు తేలాలని ఆయన తెలిపారు. ఒకసారి జనగణన చేస్తేనే, ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలుస్తుందని స్పష్టం చేశారు. మోదీ గత పదేళ్లలో విమానాశ్రయాలు, పోర్టులు, భారీ పరిశ్రమలను విక్రయించారని దుయ్యబట్టారు. కేవలం 2శాతం ఉన్న బిలియనీర్ల చేతిలోకి దేశ సంపద అంతా వెళ్తోందని, ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా ఇంతగా ప్రైవేటును ప్రోత్సహించలేదని తెలిపారు.
బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు, రాహుల్ గాంధీ తెలిపారు. దేశంలోని నిరుపేదలందరితో ఒక జాబితా రూపొందిస్తామని, రైతులు దళితులు ఆదివాసీలు, మైనార్టీలతో ఒక జాబితా రూపొందిస్తామన్నారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక మహిళను ఎంపిక చేసి రూ.లక్ష ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళ బ్యాంకు ఖాతాలో రూ.లక్ష డిపాజిట్ చేస్తామన్నారు. కుటుంబ ఖర్చుల కోసం ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాల్లో నెలకు రూ.8500 వేస్తామని పేర్కొన్నారు.
బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులతో మహిళలు ఎన్నో వస్తువులు కొనుగోలు చేస్తారని, మహిళల కొనుగోలు శక్తి పెరగటంతో పరిశ్రమల్లో వస్తు ఉత్పత్తి పెరుగుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వస్తువుల ఉత్పత్తి కోసం భారతీయ పరిశ్రమలను ప్రోత్సహిస్తామని, పరిశ్రమలను ప్రోత్సహిస్తే దేశంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. గత పదేళ్లుగా ఉద్యోగాల కల్పనను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు.
"దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ వారి కుట్రలకు వ్యతిరేకంగా పోరాడుతోంది. రాజ్యాంగం ద్వారానే పేదప్రజలకు అన్ని హక్కులు దక్కుతాయి. రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తున్నారు". - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
రిజర్వేషన్లు రద్దు చేసేందుకే ప్రభుత్వరంగ సంస్థల విక్రయం : రాహుల్ గాంధీ (ETV BHARAT) అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని మోదీ చించేయాలని చూస్తున్నారు : రాహుల్ గాంధీ - Rahul Gandhi Election Campaign
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఉంది - కేంద్రంలో కూడా ఏర్పాటు చేస్తాం : రాహుల్ గాంధీ - Rahul Gandhi Speech at Nirmal