Rachakonda CP Arrest Two Foreigners in Fake Money Scam : ఈజీమనీ పేరిట రోజురోజుకూ కొత్త తరహా మోసాలు(Money Frauds) వెలుగులోకి వస్తున్నాయి. డబ్బుపై ఉన్న అత్యాశను ఆసరాగా చేసుకుని లేనిపోని మాయమాటలు చెప్పి పలువురు నేరగాళ్లు, సామాన్యులకు కుచ్చుటోపి పెడుతున్నారు. నకిలీ నోట్లతో ప్రజలను మోసం చేస్తున్న విదేశీయుల ముఠాను రాచకొండ మల్కాజిగిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు.
కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్‌సైట్, భారీగా నిధుల సేకరణ - రాజస్థాన్‌లో నిందితుడి అరెస్ట్
నిందితుల వద్ద నుంచి 25 లక్షల రూపాయల నకిలీ నోట్లతో పాటు రసాయనాలు, 3 చరవాణులు, పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ సుధీర్‌బాబు(Rachakonda cp) పేర్కొన్నారు. కామెరాన్ దేశానికి చెందిన కోంబీ ఫ్రాంక్ సెడ్రిక్, మాలీ దేశస్తుడు గోయిట సుంగోల, డేవిడ్, రోలెక్స్, జోసఫ్ కలిసి ముఠాగా ఏర్పడ్డారు. నిందితుల్లో డేవిడ్ వెరిఫైడ్ లోన్ క్రెడిట్ కార్డు పేరుతో వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేశాడు. వాట్సప్‌లో లక్ష రూపాయల అసలు నోట్లకు బదులు 5 లక్షల రూపాయల నకిలీ నోట్లు ఇస్తామని నమ్మబలికేవారు.
Telangana Crime News :అవి అసలు నోట్లను పోలిన విధంగా ఉంటాయని నమ్మించేవారని రాచకొండ సీపీ సుధీర్‌బాబు తెలిపారు. వాట్సప్ చాటింగ్‌లో ఈ ముఠా కోట్ల రూపాయల నల్లధనం తమ వద్ద ఉందని ప్రచారం చేసుకునే వారు. కొన్ని తెల్లకాగితాలు ఇచ్చి వాటికి రసాయనాలు పూస్తే అసలు నోట్లుగా మారిపోతాయని నమ్మించారు. పలువురిని నమ్మించేందుకు కొన్ని అసలు నోట్లను కూడా ఉపయోగించారు.