APCRDA Project Office Design Voting: ఏపీ సీఆర్‌డీఏ ప్రాజెక్టు ఆఫీసు డిజైన్‌పై ప్రజల ఓటింగ్‌ను మరో వారం రోజులు పొడిగిస్తూ సీఅర్డీఏ ప్రకటన జారీ చేసింది. డిసెంబర్ 14 తేదీ వరకూ ఓటింగ్ గడువు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఆర్‌డీఏ ప్రాజెక్టు ఆఫీసు బిల్డింగు ఎలా ఉండాలనే దానిపై వెబ్సైట్ ద్వారా చేపట్టే పోలింగ్ నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు నిర్వహించారు.
ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే మరింత మంది ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు ఏపీ సీఆర్‌డీఏ అధికారులు మరో ఏడు రోజుల పాటు ఓటింగ్‌కు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 14వ తేదీ వరకు ప్రజలు వారి అభిప్రాయలను తెలియజేసే అవకాశం కల్పించారు. రాజధాని నిర్మాణంలో ఇప్పటికే ప్రతి అంశాన్ని ప్రజలకు నచ్చిన విధంగా వారి ఆమోదంతో చేసుకుంటూ ముందుకెళ్తున్న సీఆర్‌డీఏ అధికారులు, ప్రజలను మరింత దగ్గర చేయాలని నిర్ణయించారు.
ప్రాజెక్టు ఆఫీసు నిర్మాణం ఎలా ఉండాలనే దానిపై పది ఆకర్షణీయమైన డిజైన్లను చేయించి వెబ్సైట్లో ఉంచారు. ప్రజలు తమకు నచ్చిన డిజైన్ మీద క్లిక్ చేసి ఓట్ చేస్తే మెజార్టీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రజలు కింది లింకు ద్వారా సీఆర్డీఏ వెబ్సైట్లోకి వెళ్లి ఓటింగ్‌లో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
CRDA Project Office Poll: రాజధాని అమరావతిలో నిర్మించే ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం భవన డిజైన్లను ఎంపిక చేసే బాధ్యతను ప్రజలకు అప్పగిస్తూ సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10కి పైగా బిల్డింగ్ డిజైన్లను ఆప్షన్లుగా ఎంపిక చేసేందుకు వీలుగా ప్రజలకు అవకాశం కల్పించారు. ఏపీ సీఆర్డీఏ వెబ్సైట్లో ఈ ఆప్షన్లు ఇచ్చేందుకు వీలు కల్పించారు. మెజారిటీ ఓటింగ్‌ను అనుసరించి బిల్డింగ్ డిజైన్లను ఫైనల్ చేయనున్నారు. మీరు కూడా ఈ పోలింగ్‌లో పాల్గొనాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేసి, మీకు ఏ బిల్డింగ్ డిజైన్ నచ్చిందో దానిని ఎంచుకోవచ్చు.
సీఆర్డీఏ ఆఫీస్ ఎలా ఉండాలి? - మీరు సెలెక్ట్ చేసిందే ఫైనల్