తెలంగాణ

telangana

ETV Bharat / state

'అదేంటో కానీ - మా ఊరి రైల్వే స్టేషన్​లో ఒక్కటంటే ఒక్కటే రైలు ఆగుతుంది' - metpalli Railway Station Issues

Metpally Railway Station Issues : ఆ ఊరిలో రైల్వే స్టేషన్ ఉందిగానీ తగినన్ని రైళ్లు లేవు. ఒకే ఒక రైలు ఆగుతుంది. రైల్వే స్టేషన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏళ్లు గడుస్తున్నా అక్కడ కనీస మౌలిక సౌకర్యాలేవు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రైల్వేస్టేషన్‌ దుస్థితిపై ప్రత్యేక కథనం

By ETV Bharat Telangana Team

Published : Jul 1, 2024, 3:00 PM IST

Metpalli Railway Station
Metpalli Railway Station

Metpalli Railway Station Problems : జగిత్యాల జిల్లా మెట్‌పల్లి రైల్వే స్టేషన్‌ 2016 నవంబర్‌లో ప్రారంభమైంది. కరీంనగర్ నిజామాబాద్ మార్గంలో ఉన్న ఈ స్టేషన్‌లో కనీస సౌకర్యాలు కరవయ్యాయి. రోజుకు ఒకసారి పుష్‌ఫుల్‌ రైలు మాత్రమే ఈ మార్గంలో నడుస్తుంది. రైలు కోసం ఎన్నో కలలు కన్న స్థానికులకు ఆశలు అడియాసలే అయ్యాయి. ఆ ఒక్క రైలు సేవలనైనా వినియోగించుకుందామంటే మెట్‌పల్లి రైల్వే స్టేషన్‌ దుర్భరంగా ఉంటుంది. స్టేషన్‌లోని కొన్ని కట్టడాలు శిథిలమైపోతున్నాయి.

రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వహించే ఉద్యోగుల కోసం సమీపంలోనే కోట్లాది రూపాయలతో మూడేళ్ల క్రితం క్వార్టర్స్‌ నిర్మించారు. ఇవి వినియోగంలో లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయి. క్వార్టర్స్‌లోని విద్యుత్ పరికరాలు, వివిధ సామాగ్రిని దుండగులు దొంగిలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రైల్వే అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు.

ఆ రైల్వే స్టేషన్లో రోజూ టికెట్లు కొంటారు కానీ రైలెక్కరు- ఎందుకో తెలుసా?

కనీస తాగునీరు సదుపాయాలు లేక : రైల్వే స్టేషన్‌ మెట్‌పల్లి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. రైలు కోసం ఎదురు చూసే ప్రయాణికులకు దాహం వేస్తే తాగడానికి నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు. వర్షకాలంలో రైల్వే స్టేషన్‌కి వెళ్లాలంటేనే ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. స్టేషన్ చుట్టూ వర్షపు నీరు చేరి నడవలేని పరిస్థితి ఏర్పడుతోంది.

"రైల్వే స్టేషన్‌ నిర్మాణం అయిందని ఎంతో సంతోషపడ్డాం. కానీ ఇక్కడ ఎలాంటి సదుపాయాలు లేవు. రోడ్డు కరెక్టుగా లేదు ఆటోవాళ్లను రమ్మన్నా వాళ్లు కూడా రావడం లేదు. చాలామంది అమ్మాయిలు హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. వాళ్లు వచ్చిపోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. అనేక సార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది." - స్థానికులు

రైళ్ల సంఖ్య పెంచాలని డిమాండ్ :రైల్వే స్టేషన్‌కు వెళ్లే రహదారి గుంతలమయంగా మారిపోయింది. స్టేషన్ పరిసరాలు పిచ్చి మొక్కలతో అడవిని తలపిస్తుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని రైల్వేస్టేషన్‌లో పూర్తి సౌకర్యాలు కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రైళ్ల సంఖ్య పెంచితే పరిసర ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు.

కరెంట్​ స్తంభం​ ఎక్కి వ్యక్తి హల్​చల్- రెండు గంటలు నిలిచిపోయిన రైళ్లు

Secunderabad Railway Station Redevelopment 2023 : పరుగులు పెడుతోన్న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు.. అప్పటికల్లా పూర్తి..

ABOUT THE AUTHOR

...view details