ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

2 వేల ఆర్టీసీ బస్సులు, 8 వేల ఆటోలు - పీఎం మోదీ విశాఖ పర్యటన ఖర్చు ఎంతంటే? - PM MODI VISAKHAPATNAM MEETING COST

జనవరి 8వ తేదీన విశాఖలో పర్యటించిన ప్రధాని మోదీ - రూ.2 లక్షల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

PM Modi Visakhapatnam Meeting Cost
PM Modi Visakhapatnam Meeting Cost (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 13, 2025, 12:13 PM IST

PM Modi Visakhapatnam Meeting Cost: పీఎం నరేంద్రమోదీ, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిథులుగా జనవరి 8వ తేదీన విశాఖలో నిర్వహించిన కార్యక్రమానికి 12.50 కోట్ల రూపాయల మేర ఖర్చు అయినట్లు రెవెన్యూ వర్గాలు లెక్కలు తేల్చాయి.

2వేల ఆర్టీసీ బస్సులు, 8వేల ఆటోలు:తొలి విడతగా ప్రభుత్వం 5 కోట్ల రూపాయల వరకు విడుదల చేసింది. ఇంకా 7.50 కోట్ల రూపాయలు మేర నిధులు రావల్సి ఉంది. సరఫరాదారులకు ప్రస్తుతం కొంత వరకు బిల్లులు చెల్లించినా, ఇంకా బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖలో జరిగిన బహిరంగ సభ, రోడ్‌షోకు సంబంధించి ప్రజలను తరలించేందుకు 2 వేల 150 ఆర్టీసీ బస్సులు, 8 వేల ఆటోలు, 825 ప్రైవేటు బస్సులు, 180 క్యాబ్‌లను వినియోగించారు.

2 లక్షల 60 వేల ఆహార పొట్లాలు తయారు చేయించి మధ్యాహ్నం, రాత్రి వేళల్లో పంపిణీ చేశారు. వీటితో పాటు తాగునీటి సరఫరా, నగరానికి వచ్చిన పీఎం, సీఎం, గవర్నర్, డిప్యూటీ సీఎంకు నాలుగు కాన్వాయ్‌లు వినియోగించారు. మంత్రులతో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు స్టార్‌ హోటల్స్‌లో స్టే ఏర్పాటు చేశారు. వారికి సెక్యూరిటీ, రవాణా సౌకర్యాలు కల్పించారు. వీటితో పాటు భారీ ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, స్టేజ్ వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్‌రూమ్స్, వేదిక నిర్మాణం, బారికేడ్లు, టెంట్లు ఇలా తదితరాలకు అయిన ఖర్చు అదనమని జిల్లా అధికార వర్గాలు వెల్లడించాయి.

కాగా విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 8వ తేదీన పర్యటించారు. ఈ పర్యటనలో విశాఖ రైల్వే జోన్‌తో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రైల్వే, రోడ్డు ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. తొలుత సిరిపురం జంక్షన్ నుంచి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్ వరకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్​తో కలిసి ప్రధాని మోదీ భారీ రోడ్ షో నిర్వచించారు. మోదీ రాకతో ఆంధ్రప్రదేశ్​కి రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

రాష్ట్ర ప్రజల ఆశయాల సాధనకు మద్దతుగా నిలుస్తాం: ప్రధాని మోదీ

మోదీ రాకతో రూ.2.10 లక్షల కోట్ల పెట్టుబడులు - 7.5 లక్షల మందికి ఉపాధి: పవన్

ABOUT THE AUTHOR

...view details