ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వాట్సాప్‌' ద్వారా ప్రభుత్వ సేవలను ఎలా పొందాలో తెెలుసా? - పూర్తి వివరాలు మీకోసం - PRESENTATION ON WHATSAPP GOVERNANCE

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే విధానానికి స్వస్తి - అరచేతిలో వాట్సప్‌ గవర్నెన్స్! ఇంతకీ ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఎలా వినియోగించాలో? ఇప్పుడు తెలుసుకుందాం

Presentation On How To Work Whatsapp Governance Services in AP
Presentation On How To Work Whatsapp Governance Services in AP (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2025, 9:57 AM IST

Presentation On How To Work Whatsapp Governance Services in AP : దేశంలో తొలిసారిగా ‘మన మిత్ర’ పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సప్‌ గవర్నెన్స్​ను ప్రారంభించింది. వివిధ రకాల పౌరసేవల్ని సులభతరంగా ప్రజలకు అందించటమే వాట్సప్ గవర్నెన్సు లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తొలివిడతలో 161 పౌరసేవల్ని వాట్సప్ చాట్ బోట్ సహాయంతో ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం తదుపరి దశలో 360 సేవలను కూడా అందించాలని కార్యాచరణ చేపట్టింది. తొలిదశలో వివిధ దేవాలయాల్లో దర్శనాలు, గదుల బుకింగ్ తో పాటు దానాలకు సంబంధించిన సేవల్ని ఈ వాట్సప్ చాట్ బోట్ ద్వారా పొందే అవకాశం కల్పించారు.

ట్రేడ్ లైసెన్సుల జారీ, ఆస్తిపన్ను, కుళాయి ఛార్జీలు ఇలా వివిధ పురపాలక సేవలు పొందే అవకాశం ఉంది. ఇక రెవెన్యూ శాఖ, పోలీసు, పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టం లాంటి వివిధ సేవలను ప్రభుత్వం వాట్సప్ ద్వారా అందిస్తోంది. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే పనిలేకుండా అనేక పౌరసేవల్ని అరచేతికి అందించింది వాట్సప్‌ గవర్నెన్స్! ఇంతకీ ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? ఎలా వినియోగించాలో? ఇప్పుడు చూద్దాం.

'వాట్సాప్‌' ద్వారా ప్రభుత్వ సేవలను ఎలా పొందాలో తెెలుసా? - పూర్తి వివరాలు మీకోసం (ETV Bharat)

ABOUT THE AUTHOR

...view details