Pratidwani Debate on Essential Commodities Prices in AP:ప్రతిపక్ష నేతగా 'బాదుడే బాదుడు' అంటూ రాగాలు తీసిన జగన్ ముఖ్యమంత్రి అయ్యాక జనాన్ని అడ్డగోలుగా బాదుతున్నాడు. ఐదేళ్ల కాలంలో నిత్యావసరాల ధరలు రెండు మూడింతలయ్యాయి. ఇంటి బడ్జెట్ పెరిగిపోయి సామాన్య జనం అల్లాడుతున్నారు. నెలవారీ ఇంటి ఖర్చులు కనీసం 15 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయలకు చేరాయి. ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ టికెట్ రేట్లను పెంచి ప్రజల నడ్డి విరుస్తోంది. ఇక ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను పేరిట దంచుడే దంచుడు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కలేనా!- ఐదేళ్లుగా వైసీపీ చేసిందేంటి? - Andhra Pradesh Special Status
ఇసుకే బంగారమాయె అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తుకుంటున్నారు. గతంలో టీడీపీ ఉచితంగా ఇసుక అందించగా, జగన్ వచ్చాక లారీ ఇసుక ధర రూ. 40 వేలకు చేరింది. జగన్ కంపెనీ కోసం సిమెంట్ వ్యాపారులు సిండికేట్గా మారారు. అంతటితో ఆగకుండా సిమెంట్ ధరలను విచ్చలవిడిగా పెంచేశారు. అలాగే స్టీల్, చెక్క సహా ఇంటి నిర్మాణ సామగ్రి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనను విరమించుకునేలా పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్నవి కూడా మన రాష్ట్రంలోనే కావడం విశేషం. రాష్ట్రంలో ధరల దంచుడుపై ప్రతిధ్వని చర్చ చేపట్టింది.
విచ్చలవిడిగా వైసీపీ నేతల భూఆక్రమణలు - కన్ను పడితే చాలు స్థలం కబ్జానే ? - YCP Leaders Land Grabs
APSRTC Higher Charges Effect:పేదలు ఏ బస్సు ఎక్కుతున్నారో ఆ బస్సును ప్రైవేటుకు అమ్మేయాలని చూశారని గత ప్రభుత్వంపై నిందలు మోపేలా సీఎం జగన్ గత స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రస్తావించారు. పేదలపై తనకెంతో ప్రేమ ఉన్నట్లు, వారికి ఎంతో మేలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పే ప్రయత్నం చేశారు. అదే పేదలు, సామాన్యులు అత్యధికంగా ప్రయాణించే ఆర్టీసీ బస్సుల ఛార్జీలను మాత్రం మూడుసార్లు పెంచేశారు. ప్రజల నుంచి ఏటా 2వేల కోట్లను పిండుకుంటున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత భారీగా ఛార్జీలు పెంచలేదు.
మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపిన జగన్‌కు ఎందుకు ఓటేయాలి?
Essential Commodities Prices:ఇటీవల పెరిగిన టమోటా ధరలను చూసి సామాన్యులకు నోటమాట రాలేదు. అదేబాటలో కందిపప్పు, బియ్యం, వంట నూనె, పాలు నిత్యావసరాల ధరలు చూసి హడలిపోతున్నారు. ఉపాధి అవకాశాల కోసం పట్టణాలకు వలసలు వెళ్లిన వేతన జీవులు అద్దెల భారం, పన్నుల మోతతో బతుకెళ్లదీయలేక అవస్థలు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. పప్పు ధాన్యాల నుంచి ఉప్పు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
విద్యుత్ సర్దుబాటు, ట్రూ అప్ ఛార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న మోతపై సామాన్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ జీవనం రోజురోజుకి భారంగా మారిపోతుంది. గ్రామాల్లో ఎటువంటి పనులు లేక నగరాలకు ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని వలసజీవులు, పేదలు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుల వ్యవధిలోనే సరకుల ధరలు 20 నుంచి 30శాతం పెరుగుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.