ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వ్యవసాయమంటే దండగ కాదు - పండగ అని నిరూపిస్తున్న యువ రైతులు - PRAGATHI YUVA KENDRAM

యువరైతులకు సేంద్రీయ సాగు మెళకువలు - భవిష్యత్ తరాలకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం

pragathi_yuva_kendram
pragathi_yuva_kendram (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 18, 2024, 9:32 PM IST

Pragathi Yuva Kendram in Nellore District:సొంతంగా ఎదగాలని ఉన్న ఊర్లోనే ఉంటూ భూమినే నమ్ముకుని బతుకుతున్నారు. ఎంతో మంది యువ రైతులు. అయితే మారుతున్న పరిస్థితుల కారణంగా పంటల ఉత్పత్తిలో మార్పులు, మార్కెటింగ్‌ లాంటివి చేయలేక తీవ్రమైన నష్టాలు చవి చూస్తున్నారు చాలా మంది. ఇలాంటి సాగు సమస్యలకు చెక్‌ పెట్టాలని నెల్లూరు జిల్లాలో ప్రగతి యువకేంద్రం ఏర్పాటు చేసుకున్నారు ఆ యువరైతులు. సేంద్రీయ వ్యవసాయంతోపాటు సాగులో లాభాలు ఎలా సాధించాలో నేర్పిస్తున్నారు.

10 మందితో మెుదలై 100మంది సభ్యులు:వ్యవసాయమంటే దండగా కాదు, పండగ అని నిరూపిస్తున్నారు నెల్లూరు జిల్లాలోని యువ రైతులు. అందరిలా ఉద్యోగాలు చేయడం కాకుండామ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించాలని ముందుకు సాగుతున్నారు. సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తూ సక్సెస్‌కు బాటలు వేసుకుంటున్నారు. దీనికోసం ప్రగతి యువ కేంద్రాన్ని ప్రారంభించి వినూత్నంగా సాగు చేస్తూ గిట్టుబాటు ధరలను సాధించుకుంటున్నారు ఈ ఔత్సాహికులు.

జిల్లాలోని లేగుంటపాడులో ఈ ప్రగతి యువ కేంద్రం ఉంది. అందరి ఆరోగ్యం కాపాడి భవిష్యత్ తరాలకు నాణ్యమైన ఆహారం ఇవ్వాలనే లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పడింది. 2017లో 10 మందితో మెుదలై ఇప్పుడు 100మంది యువరైతులు సభ్యులుగా పని చేస్తున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన గ్రాడ్యుయేట్స్‌, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌ ఉండటం విశేషం.

మార్కెటింగ్ అంశాలపై యువతకు శిక్షణ:'కల్తీ లేని ఆహారం పండిద్దాం రసాయనాలు వాడకుండా ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేద్దాం' అనే నినాదంతో ప్రగతి యువ కేంద్రం సభ్యులు కృషి చేస్తున్నారు. ప్రతి నెల ఒకటి రెండు సార్లు క్షేత్రంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుల్లో యువ రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ వ్యవసాయంపై ఆసక్తి పెంచుతున్నారు. ముఖ్యంగా మార్కెటింగ్ అంశాలపై అవగాహన కల్పిస్తూ శిక్షణ ఇస్తున్నారు. ఈ ప్రగతి యువ కేంద్రం ద్వారా శిక్షణ పొంది హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు వంటి ప్రాంతాల్లో చాలా మంది యువ రైతులు సాగు చేస్తున్నారు. పూర్తి సేంద్రీయ విధానంలో క్యారెట్, బీట్రూట్, టమోటా, సపోటా, మామిడి, డ్రాగన్‌, నిమ్మ వంటి పంటలు పండిస్తోన్నారు. వీటిని సోలార్‌ డ్రైయర్‌ పద్ధతిలో ఎండపెట్టి పొడి చేస్తున్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌ వేదికగా దేశ, విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారు.

ఈ ఆవిష్కరణలు చూస్తే "వావ్" అనాల్సిందే! - ఏఐ పరిజ్ఞానంతో వినూత్న యంత్రాలు - మీరూ చూసేయండి

సోషల్‌ మీడియా వేదికగా ఉత్పత్తులు: ఈ గ్రూపులోని సభ్యులు పండించిన, తయారు చేసిన ఉత్పత్తులను ప్రచారం చేసేందుకు గుణపాటిస్ అనే యూట్యూబ్ ఛానల్‌ కూడా నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో మార్కెటింగ్ చేసేందుకు ఈ-కామర్స్ వెబ్ సైట్స్‌, సోషల్‌ మీడియాను వేదిక వినియోగించుకుంటున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే అందరూ ఒకచోట కలిసి మార్కెటింగ్ విధానాలను చర్చిస్తారు. అలాగే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులను ఆహ్వానిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది యువరైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. కానీ ఆ ఉత్పత్తిని ఎలా మార్కెటింగ్‌ చేసుకోవాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారందరికీ మేం సాయపడుతున్నాం అంటున్నారు ప్రగతి యువ కేంద్రం సీఈఓ భూపేశ్‌ రెడ్డి.

సాగు చేస్తూ గ్రామీణ ప్రజలకు ఉపాధి: సోలార్ శీతల గిడ్డంగులు, పాలిహౌస్‌, షేడ్ నెట్లు వంటి వాటిని సబ్సీడీలతో ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ యువరైతులు. వీరి సేంద్రీయ ఉత్పత్తులను కొన్ని పరిశ్రమలు, మాల్స్ కొనుగోలు చేస్తున్నాయి. అయితే వ్యవసాయరంగంలోకి వచ్చే యువతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే సేంద్రీయ ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటుకు అధిక సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. లక్షల జీతాల వదులుకుని వ్యవసాయాన్ని నమ్ముకున్నారు వీరంతా. సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తూ లాభాలతోపాటు గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఈ ఏడాదిలో 7 కోట్ల రూపాయల వ్యాపారం కూడా చేశారు. రానున్న 3ఏళ్లలో 100కోట్ల రూపాయల సేంద్రీయ ఉత్పత్తులను ఇతర దేశ, విదేశాలకు ఎగుమతి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.

అరకు లోయ టు లంబసింగి - ఆకాశం నుంచే అందాల వీక్షణ

"మాకేంటి!" లక్కీ లాటరీ వరించినా మాఫియా బెదిరింపులు - "దుకాణం పెట్టాలంటే ఫార్మాలిటీస్‌ పూర్తి చేయాలంట"

ABOUT THE AUTHOR

...view details