తెలంగాణ

telangana

సమ్మర్​ ఎఫెక్ట్ ​- గిర్రున తిరుగుతున్న కూలర్లు, ఏసీలు - పెరుగుతున్న విద్యుత్​ వినియోగం - Power Demand Increased in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Apr 15, 2024, 7:22 AM IST

Power Demand Increased in Hyderabad : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో విద్యుత్‌ డిమాండ్‌ కూడా అంతే స్థాయిలో పెరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో నెలకు సగటున 2,500ల నుంచి 3,000 వరకు కొత్త విద్యుత్ కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో పదేళ్లలో మహానగరంలో విద్యుత్‌ వినియోగం రెట్టింపైంది.

Electricity Consumption Double in GHMC
Power Supply in Hyderabad

Power Demand Increased in Hyderabad :గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో విద్యుత్ కనెక్షన్లు ఏటా పెరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రతి సంవత్సరం పెరుగుతున్న విద్యుత్ కనెక్షన్లతో పాటు, విద్యుత్ గృహోపకరణాలు వాడే వారి సంఖ్య కూడా భారీగానే పెరుగుతుంది. ఏసీలు, గీజర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, గ్రైండర్లు, కంప్యూటర్లు వాడే వారి సంఖ్య రెట్టింపవుతోంది. ఎండవేడిమితో ఉపశమనం కోసం జనం ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు విరామం లేకుండా వినియోగిస్తున్నారు. దీంతో రోజురోజుకీ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ దూసుకెళ్తోంది. ఇందుకు అనుగుణంగానే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

Power Connections Increased in GHMC: జీహెచ్​ఎంసీ పరిధిలో గృహ విద్యుత్ కనెక్షన్లు(Power Connections in Hyderabad) ఏటా సుమారు లక్షకు పైగా పెరుగుతున్నట్లు విద్యుత్ శాఖ అంచనావేస్తోంది. ఇంటి కనెక్షన్లే కాకుండా అన్ని కేటగిరీల్లోనూ ఆ సంఖ్య పెరుగుతూ వస్తోంది. నిరంతరం నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు జరగకుండా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మూడేళ్లలో పెరిగిన విద్యుత్ కనెక్షన్ల గణాంకాల్ని పరిశీలిస్తే అన్ని కేటగిరిల్లోనూ ఏటా సగటున లక్ష చొప్పున పెరిగినట్లు అధికారులు గుర్తించారు.

దంచికొడుతున్న ఎండలు - గిర్రుమంటోన్న కరెంట్ మీటర్ - Power Consumption In Telangana

గ్రేటర్​లో ఆరో తేదీలోపు బిల్లులు జారీ చేయాలి - విద్యుత్​ సిబ్బందికి ఆదేశాలు - hyderabad zero current bills

Power Consumption in GHMC: 2021లో గృహ 44,26,472 కనెక్షన్లు, 7,31,441 వాణిజ్య కనెక్షన్లు, 35,283 పారిశ్రామిక కనెక్షన్లు, 2,02,707 ఇతర కనెక్షన్లు, మొత్తం కలిపి 53,95,903 కనెక్షన్లు ఉన్నాయి. 2022లో 46,28,067 గృహ విద్యుత్ కనెక్షన్లు, 7,61,938 వాణిజ్య కనెక్షన్లు, 35,419 పారిశ్రామిక కనెక్షన్లు, 2,11,020 ఇతర కనెక్షన్లు, మొత్తం కలిపి 56,36,444 కనెక్షన్లు ఉన్నాయి. 2023లో 50,99,190 గృహ కనెక్షన్లు, 8,22,821 వాణిజ్య కనెక్షన్లు, 36,440 పారిశ్రామిక కనెక్షన్లు, 1,82,344 ఇతర కనెక్షన్లు, మొత్తం కలిపి 61,40,795 ఉన్నాయి.

జీహెచ్​ఎంసీ పరిధిలో పెరుగుతున్న విద్యుత్​ కనెక్షన్ల వివరాలు:

సంవత్సరం గృహ కనెక్షన్లు వాణిజ్య కనెక్షన్లు పారిశ్రామిక కనెక్షన్లు ఇతర కనెక్షన్లు మొత్తం
2021 44,26,472 7,31,441 35,283 2,02,707 53,95,903
2022 46,28,067 7,61,938 35,419 2,11,020 56,36,444
2023 50,99,190 8,22,821 36,440 1,82,344 61,40,795

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో తలసరి విద్యుత్ వినియోగం పదేళ్లలో భారీగా పెరిగింది. విద్యుత్ తలసరి డిమాండ్, సబ్ స్టేషన్ల సంఖ్య దాదాపు రెండింతలయ్యాయి. 2014లో తలసరి విద్యుత్ వినియోగం(Per Capita Electricity Consumption) 1,356 యూనిట్లు ఉంటే, 2024లో అది అమాంతం 2,261 యూనిట్లకు చేరింది. పెరిగిన డిమాండ్‌కు తగ్గట్లు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు.

మే నెల రికార్డులు మార్చిలోనే నమోదవుతున్నాయి - రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్​ వినియోగం - power Consumption in Telangana

సారీ! ఈసారి నో జీరో బిల్ - మొత్తం కట్టాల్సిందే - వినియోగదారులకు షాక్ - No Zero Current Bill in April 2024

ABOUT THE AUTHOR

...view details