తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం టెండర్ల మహర్దశ - కిక్కెవరికో..? లక్కెవరికో?

ఏపీలో మద్యం టెండర్లకు గడువు పెంపు - పట్టణాల్లోని దుకాణాలకు పోటాపోటీ - రాజకీయ నాయకుల నుంచి దళారుల వరకు ఎత్తుకు పైఎత్తులు

AP WINE SHOP TENDER LAST DATE
ap wine shop tender process 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2024, 1:31 PM IST

AP New Liquor Policy 2024 : ఆంధ్రప్రదేశ్​ స్టేట్​ గవర్నమెంట్​ తీసుకొచ్చిన మద్యం పాలసీ వ్యాపారుల్లో కిక్కు పెంచింది. లాటరీలో ఒక్క లిక్కర్​ షాప్​ దక్కినా చాలనే భావనతో మద్యం టెండర్ల దరఖాస్తులకు క్యూ కడుతున్నారు. ఈ అవకాశం దక్కించుకోవడానికి పొలిటకల్​ లీడర్ల నుంచి దళారుల వరకు ఎత్తుకుపైఎత్తులు వేస్తూ లాటరీ విధానం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే దరఖాస్తు దాఖలుకు 11వ తేదీ వరకు గడువు పెంచుతూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా అటు వ్యాపార వాంఛ, ఇటు రాజకీయ కాంక్షల మధ్యవర్తులు రాయబారాలు జరుపుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయి.

వైఎస్ఆర్​ కడప జిల్లాలో 139 దుకాణాలకు మంగళవారం రాత్రి వరకు 1,800 దరఖాస్తులు వచ్చాయి. కొన్ని చోట్ల అప్లికేషన్లు వేయనీయకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లాతో పోల్చితే జిల్లాలో అక్రమాలు, అంతర్గతంగా దౌర్జన్యాలు భారీగా జరుగుతున్నాయి. ఈ నెల 14న మద్యం దుకాణాలను లాటరీ ప్రాసెస్​లో కేటాయించడానికి ఆబ్కారీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. కడపలోని జిల్లా పరిషత్‌ కాన్ఫెరెన్స్​ హాల్​లో కలెక్టర్‌ శివశంకర్‌ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. దరఖాస్తు చేసుకున్న వారికి ఎంట్రీ పాసులు జారీ చేసి లాటరీ ప్రోగ్రాంకు అనుమతిస్తారు. కడప నగరం, ఇతర పట్టణ ప్రాంతాల్లో దుకాణాలకు వ్యాపారులు పోటీపుడుతున్నారు.

లాటరీలో లిక్కర్​ షాప్​ దక్కించుకున్నా మాకు వాటా ఇవ్వాల్సిందే! : కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు ప్రాంతాల దుకాణాలకు ఎక్కువ మంది అప్లై చేయడానికి పోటీ పడ్డారు. కొన్నిచోట్ల రాజకీయ నేతల బెదిరింపులతో దరఖాస్తులు తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. లాటరీలో లిక్కర్​ షాప్​ దక్కించుకున్నా, వ్యాపారం ఎలా చేస్తావో చూస్తామంటూ బెదిరంపులతో కొందరు వెనకడుగు వేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు అవకాశం ఉండడంతో కొందరు ధైర్యంగా గోప్యంగా అప్లికేషన్​ పూర్తి చేశారు. ఏ దుకాణానికి ఎవరు దాఖలు చేశారనే విషయం తెలుసుకునే విధానం లేకపోవడంతో నేతలు, ఔత్సాహిక వ్యాపారులు ఆసక్తిగా ఇతరుల ద్వారా అప్లికేషన్ల గురించి ఆరా తీస్తున్నారు. శుక్రవారం వరకు మరిన్ని దరఖాస్తులు దాఖలయ్యే అవకాశం లేకపోలేదు.

నయా లిక్కర్ పాలసీతో వ్యాపారుల్లో కిక్కు : అయిదేళ్ల తర్వాత అమల్లోకి వచ్చిన నూతన లిక్కర్ పాలసీ వ్యాపారుల్లో కిక్కు పెంచింది. లాటరీ విధానంలో మద్యం దుకాణం ఒక్కటి తగిలినా చాలు పరపతి పెంచుకోవచ్చనేది చాలా మంది భావన. ఆ అవకాశం దక్కించుకోవడానికి పొలిటికల్​ లీడర్ల నుంచి దిగువ స్థాయి దళారుల వరకు ప్రస్తుతం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగంలోని ఎంప్లాయిస్​ సైతం దుకాణాల కోసం పోటీపడుతున్నారు. కొందరైతే లిక్కర్​ షాప్​ ఉండడం స్టేటస్‌గా భావిస్తున్నారు.

పరిమితి లేకపోవడంతో ఒక్కొక్కరు పదుల సంఖ్యలో టెండర్లకు అప్లికేషన్లు దాఖలు చేస్తున్నారు. ఏదేని ఒకటైనా తగలక పోతుందా, అనే ఆలోచనతో పోటీపడుతున్నారు. కడప జిల్లాలో ప్రెజెంట్​ మద్యం దుకాణాలపైనే చర్చోపచర్చలు సాగుతున్నాయి. లైసెన్స్‌ ఫీజు 6 దఫాలుగా చెల్లించుకునే వెసులుబాటు ఉండడంతో పోటీ తీవ్రంగా మారింది. రాష్ట్ర సర్కార్​ దరఖాస్తుల దాఖలుకు మరో రెండు రోజులు గడువు పెంచడంతో ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మద్యం టెండర్ల ఆశావహులకు గుడ్ న్యూస్​ - మరో రెండు రోజులు గడువు పెంపు

లిక్కర్ బిజినెస్​లోకి సాఫ్ట్​వేర్లు, డాక్టర్లు - తగ్గేదే లే అంటున్నారుగా! - AP Liquor Shops Application Process

ABOUT THE AUTHOR

...view details