Polices are Registering Cases Against Riots in Palnadu District:ఎన్నికల రోజు, ఆ తరువాత పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లకు బాధ్యులైన వారిపై పోలీసులు చర్యలు ముమ్మరం చేశారు. ఘర్షణలు జరుగుతున్న సమయంలో లభించిన వీడియోల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తిస్తున్నారు. తాజాగా గురజాల నియోజకవర్గంలో 100 కేసులు, 192 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. దాచేపల్లి మండలంలో 70, పిడుగురాళ్ల మండలంలో 62 మందిపై కేసులు పెట్టారు. మరో 67 మందిపై ఐపీసీ 307, 324, 323 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
రాష్ట్రంలో అల్లర్లపై సిట్ దర్యాప్తు షురూ- అధికార పార్టీ నేతల్లో వణుకు - SIT investigation
ఎన్నికల రోజుహింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు:సత్తెనపల్లి నియోజకవర్గంలో 34 కేసులు, 70 మంది నిందితులను గుర్తించారు. పెదకూరపాడు నియోజకవర్గంలో 5 కేసులు, 99 మంది నిందితులను గుర్తించారు. నరసరావుపేట నియోజకవర్గంలో 20 కేసులు, 60 మంది నిందితులను గుర్తించారు. మరో 11 మందిపై ఐపీసీ 147, 148, 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాచర్లలో అత్యధిక హింసాత్మక ఘటనలు జరిగినప్పటికీ కేసుల విషయంలో పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా గోప్యత పాటిస్తున్నారు.
వైెెెఎస్సార్సీపీ, టీడీపీ వర్గీయులపై కేసులు పెట్టిన పోలీసులు:పల్నాడు జిల్లా కారంపూడిలో ఈ నెల 14న జరిగిన దాడులు, హింసాత్మక ఘటనలపై అరెస్టులు ప్రారంభమయ్యాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేతృత్వంలో కారంపూడిలో టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేయటంతో పాటు ప్రైవేటు ఆస్తులపై దాడులు చేశారు. కొన్ని వాహనాల్ని తగులబెట్టారు. ప్రతిచర్యగా టీడీపీ వర్గీయులు రోడ్లపైకి వచ్చి వైఎస్సార్సీపీకు చెందిన వారి ఆస్తులపై దాడులు చేశారు. ఈ రెండు ఘటనలపైనా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. ఘర్షణలకు సంబంధించి వైసీపీకు చెందిన 11మందిని, టీడీపీకు చెందిన 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు పోలీసుల తీరుపై తెలుగుదేశం కార్యకర్తల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గొడవలు జరిగిన రోజు అక్కడ లేకపోయినా పోలీసులు అన్యాయంగా కేసుల్లో ఇరికించారని దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా వదిలేశారని ఆరోపించారు.
పల్నాడులో 144 సెక్షన్- భారీగా పోలీస్ పహారా - attacks in palnadu
గొడవలు జరుగుతాయని ముందే తెలిసినా ఎందుకు చర్యలు తీసుకోలేదు?:ఎన్నికళ వేల పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాకాండ నేపథ్యంలో జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. అయితే, ఆయన సస్పెన్షన్‌కు గురవడానికి వెనుక అప్పటి డీజీపీ నుంచి, కిందిస్థాయి అధికారుల వరకు అందరూ సహాయనిరాకరణ చేయడం కూడా ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. తన కింద పనిచేసే అధికారులు, సిబ్బందిలో కొందరు వైఎస్సార్సీపీకు కొమ్ముకాస్తూ, శాంతిభద్రతల నిర్వహణను గాలికొదిలేశారని డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు, ఇతర సిబ్బందిలో 20 మందిని బదిలీ చేయాలని ఆయన కోరినా పాత డీజీపీ పెడచెవిన పెట్టారని సమాచారం. పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే తెలిసినా అక్కడ పరిస్థితిని సమీక్షించి జాగ్రత్తలు తీసుకోవడంలో సీఎస్ జవహర్‌రెడ్డి, ప్రస్తుత డీజీపీ హరీష్‌కుమార్ గుప్తాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు - వీడియోలు చూసి నిందితులను గుర్తిస్తున్న పోలీసులు (ETV Bharat) 'స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద వైఎస్సార్సీపీ నేతలు మారణాయుధాలతో ఉంటే పోలీసులు ఏం చేశారు?'