ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అవినాష్‌రెడ్డి పీఏ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత - 16 రోజులుగా పరారీలోనే - PT WARRANT ON VARRA RAVINDER

అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత - వర్రా రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డిపై అభియోగాలు

YCP MP Avinash Reddy PA Bail Petition Cancelled
YCP MP Avinash Reddy PA Bail Petition Cancelled (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 28, 2024, 4:59 PM IST

Updated : Nov 28, 2024, 5:58 PM IST

YCP MP Avinash Reddy PA Bail Petition Cancelled : వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డి (Raghava Reddy) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కడప కోర్టు కొట్టివేసింది. అసభ్య పోస్టుల వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు అదుపులో ఉన్న ఆ పార్టీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం మేరకు అవినాష్‌రెడ్డి పీఏ రాఘవరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైఎస్ షర్మిల, సునీత, విజయమ్మపై వర్రా రవీందర్‌రెడ్డితో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అయితే గత 16 రోజులుగా రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు.

Police issued PT warrant on Varra Ravinder Reddy : అసభ్యకర పోస్టుల అంశంలో అరెస్టైన వైఎస్సార్సీపీ సోషల్‌ మీడియా కార్యకర్త వర్రా రవీందర్‌రెడ్డిని పోలీసులు పీటీ వారెంట్‌పై కడప జైలు నుంచి బాపట్ల తీసుకువెళ్లారు. ఈ కేసుకు సంబంధించి వర్రా రవీందర్‌రెడ్డిని సాయంత్రం బాపట్ల జూనియర్‌ సివిల్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. గతంలో చంద్రబాబు, లోకేశ్, పవన్‌ కల్యాణ్‌పై అసభ్యకర పోస్టులు అంశంలో వర్రా రవీందర్‌రెడ్డిపై పెదనందిపాడు పోలీసుల స్టేషన్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఎంపీ వైఎస్ అవినాష్‌ రెడ్డి పీఏ రాఘవరెడ్డి ఎక్కడ? - సెర్చ్ వారెంట్ జారీ

వర్రా కేసులో పలువురు అనుమానితులు : గత ఐదేళ్లగా జగన్‌ను విమర్శించిన టీడీపీ, జనసేన నేతలే లక్ష్యంగా సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన, పెట్టించిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు విచారణ వేగవంతం చేస్తున్నారు. ఈనెల 8వ తేదీన పులివెందుల పోలీస్ స్టేషన్​లో నమోదైన అట్రాసిటీ కేసులో వర్రా కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇతనిపై వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా పది కేసులు నమోదు కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 40 కేసులు నమోదయ్యాయి. వర్రా కేసులో పలువురు అనుమానితులను పోలీసులు విచారించారు.

వైఎస్సార్సీపీ 'సోషల్‌' సైకోలపై గురి - త్వరలోనే వారందరికీ 41 ఏ నోటీసులు

"ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారో?" - అజ్ఞాతంలోకి 'పులివెందుల' వైఎస్సార్సీపీ నేతలు

Last Updated : Nov 28, 2024, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details