ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రేమించలేదని స్నేహితుడే చంపేశాడు - సాఫ్ట్​వేర్ ఇంజనీర్ మర్డర్‌ కేసులో కొత్త ట్విస్ట్ - Miyapur software Engineer Murder - MIYAPUR SOFTWARE ENGINEER MURDER

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ స్పందన హత్య కేసును ఛేదించిన పోలీసులు - పెళ్లికి నిరాకరించిందని హత్య చేసిన స్నేహితుడు మనోజ్‌కుమార్‌

Software Engineer Spandan Murder
Software Engineer Spandan Murder (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2024, 8:58 PM IST

Police Solved Miyapur Software Engineer Spandan Murder Case:హైదరాబాద్​లోనిమియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 30వ తేదీన జరిగిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ స్పందన హత్య కేసును పోలీసులు ఛేదించారు. స్పందన స్నేహితుడు అయిన మనోజ్ కుమార్ ఈ హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. మియాపూర్ సీఐ రామలింగ దుర్గ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం దీప్తి శ్రీనగర్‌లోని సీబీఆర్ ఎస్టేట్స్‌లో ఉండే బండి స్పందన అనే మహిళ హత్యపై కేసులో మృతురాలి కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారించగా స్పందన క్లాస్‌మేట్ మనోజ్ కుమార్ ఈ హత్య చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. చదువుకునే రోజుల్లోనే మనోజ్ కుమార్, ప్రేమిస్తున్నానంటూ వెంటపడేవాడని, కానీ స్పందన అంగీకరించకుండా స్నేహితులుగానే ఉందామని చెప్పిందని తెలిపారు. తర్వాత స్పందన తన స్నేహితుడు వినయ్ కుమార్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

స్పందన, మనోజ్ కుమార్‌లతో పాటు మరో ముగ్గురు వ్యక్తులు గత 10 సంవత్సరాలుగా కలిసి ఉద్యోగం చేస్తున్నారు. కొంతకాలంగా భర్త వినయ్ కుమార్‌తో గొడవల కారణంగా అతనికి దూరంగా ఉంటున్న స్పందన, వేరే స్నేహితులతో చనువుగా ఉంటూ మనోజ్ కుమార్‌ను సైతం దూరం పెట్టింది. ఈ విషయంపై స్పందనతో రెండు, మూడు సార్లు మనోజ్ గొడవ పడ్డాడు. తనకు దూరంగా ఉంటుందని మనసులో పెట్టుకొన్న మనోజ్ ఎలాగైనా స్పందనను మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సెప్టెంబర్ 30న స్పందన ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె ఇంటికి వచ్చాడు. స్పందనతో పెళ్లి విషయంమై గొడవ పడ్డాడు. ఆమె నిరాకరించడంతో తనతో తెచ్చుకున్న బండరాయి, స్క్యూ డ్రైవర్‌తో పొడిచి దారుణంగా హత్య చేశాడని దర్యాప్తులో తేలింది. నిందితుడు మనోజ్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

భర్తతో విడాకుల కేసు : 2022 ఆగస్టులో స్పందనకు వినయ్‌కుమార్‌తో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్​. 2023లో భర్త వేధిస్తున్నాడంటూ మియాపూర్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం వారిద్దరి విడాకుల కేసు కోర్టులో ఉంది.

కన్న కొడుకు దారుణాలు- ఆస్తి రాయించుకుని తల్లికి చిత్రహింసలు - Son Attacks Mother Over Property

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో ఘర్షణ - దారి కోసం నలుగురిపై కత్తితో దాడి - Clash at Devi Navratri Festival

ABOUT THE AUTHOR

...view details