తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఈ అన్నాచెల్లెళ్ల కోసం 3 రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు' - Brother And Sister Company Fraud - BROTHER AND SISTER COMPANY FRAUD

Brother And Sister Company Fraud : వారిద్దరూ 30 ఏళ్లలోపు వయసున్న అన్నాచెల్లెళ్లు అడ్డదారిలో కోట్లు సంపాదించడంలో ఆరితేరారు. వచ్చిన డబ్బును విచ్చలవిడిగా ఖర్చులు చేసేవారు. పరారీలో ఉన్న ఆ అన్నాచెల్లెళ్ల కోసం ఇప్పుడు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, పశ్చిమబంగ రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు.

Brother And Sister Company Fraud In Hyderabad
Brother And Sister Company Fraud In Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 12:09 PM IST

Brother And Sister Company Fraud In Hyderabad :జూబ్లీహిల్స్‌లో ఇటీవల కిడ్నాప్‌కు గురైన గిగ్లైజ్‌ సాఫ్ట్‌వేర్‌ సంస్థ నిర్వాహకుడు వాకాటి రవిచంద్రా రెడ్డి (29), ఆయన సోదరి చందనారెడ్డి అలియాస్‌ యామిని అలియాస్‌ సౌమ్య (27) గాలింపు చర్యల్లో వారు చేసిన మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే రవిచంద్రారెడ్డి తన సంస్థలో 1200 మందిని బ్యాక్‌డోర్‌లో నియమించుకుని జీతాలు చెల్లించకుండా వారంతా సక్రమమైన పద్ధతిలో ఉద్యోగంలోకి రాలేదనే కారణంతో వారందరినీ కొలువులోంచి తీసేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఇదే మోసానికి సంబంధించి రవిచంద్రా రెడ్డి సహా మరికొందరిపై రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో దాదాపు 115 మంది ఫిర్యాదులు చేసినట్లు గుర్తించారు. రవిచంద్రా రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో ఒక గుడికి రాసిచ్చిన రూ.కోటి చెక్కు బౌన్స్‌ కావడంతో ఏపీలోనూ మరో కేసు నమోదైంది.

రూ.కోట్లు కొట్టేసి పరారైన బ్యాంక్​ మేనేజర్ - ఎట్టకేలకు పట్టుకున్న పోలీసులు.

ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌లో కథనమని : రవిచంద్రా రెడ్డి దాదాపు 25కు పైగా కంపెనీలలో డైరెక్టర్‌గా ఉన్నట్లు చూపించడమే కాకుండా, ఫోర్బ్స్‌ పుస్తకంలో 2.5 బిలియన్ల వ్యాపారం చేస్తున్నట్లు, సేవారంగంలో ఉన్నట్లు కథనం వచ్చిందని ఉద్యోగులను నమ్మించే ప్రయత్నించాడు. దోచుకున్న డబ్బుతో రవిచంద్రా రెడ్డి తరచూ శ్రీలంకకు, అతని సోదరి దుబాయికి వెళ్లి జల్సాలు చేస్తున్నట్లు గుర్తించారు. పశ్చిమ బెంగాల్‌లో దాదాపు రూ.800 కోట్ల కుంభకోణంలో రవిచంద్రారెడ్డి పాత్ర ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.

సౌమ్యపై మాదాపూర్‌లో 2023లోనే ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు ఆమెపై మూడు ఫిర్యాదులున్నట్లు తేలింది. బెంగళూరులో ఒక సంస్థ పెట్టి దాదాపు రూ.12 కోట్లు, విజయవాడ ఒక సంస్థ పేరుతో రూ.15 కోట్ల మేర దోచుకున్నట్లు గుర్తించారు.

ఎంపీగా నిలబడి : ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ చందనా రెడ్డిని నంద్యాల ఎంపీగా లిబరేషన్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున నిలిపారు. ఈ సందర్భంగా ఆమె 6 ఫార్చ్యూనర్‌ అద్దె కార్లను, 30 మంది బౌన్సర్లను అద్దెకు, గిగ్లైజ్‌ కంపెనీలో ఉద్యోగ అవకాశం కల్పించిన దాదాపు 150 మందికి పైగా ఉద్యోగులను నామినేషన్‌ సందర్భంగా అక్కడికి తీసుకెళ్లి హడావుడి చేసినట్లు తేలింది. జూబ్లీహిల్స్‌లో రవిచంద్రా రెడ్డి ఉంటున్న ఇంటి అద్దె రూ.2.50 లక్షలని, ప్రత్యేక జాతికి చెందిన 3 కుక్కలున్నట్లు గుర్తించారు. గత 3 నెలలుగా అద్దె చెల్లించడం లేదని లేదని తెలుసుకుని పోలీసులు విస్తుపోయారు.

ఓ సినీ నిర్మాత స్వీయ దర్శకత్వంలో - ఇద్దరు బ్యాంకు ఉద్యోగుల 'స్కామ్​ కథాచిత్రం' - TELUGU FILM PRODUCER FRAUD

రూ.10వేలకు 20 వేలు వస్తాయన్నారు - చివరకు రూ.10కోట్లు కొట్టేశారు - Investment Fraud in Karimnagar

ABOUT THE AUTHOR

...view details