ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి కాకాణికి 54 ప్రశ్నలు - ముత్తుకూరు పోలీసుల విచారణ - POLICE INQUIRY ON KAKANI GOVARDHAN

ముత్తుకూరు పీఎస్‌లో మాజీ మంత్రి కాకాణిని ప్రశ్నించిన పోలీసులు

Police Questioned Kakani Govardhan Reddy
Police Questioned Kakani Govardhan Reddy (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 13, 2024, 5:32 PM IST

Police Interrogation Kakani Govardhan :నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్​లో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డిని పోలీసులు విచారించారు. సోషల్ మీడియాలో టీడీపీ నేత సోమిరెడ్డిపై ఆరోపణలు, కార్టూన్ల ప్రచురణపై తెలుగుదేశం నాయకుల ఫిర్యాదుతో ముత్తుకూరు ఠాణాలో కాకాణిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి కృష్ణపట్నం సీఐ రవినాయక్‌ సమక్షంలో రెండున్నరగంటల పాటు విచారించారు.

విచారణలో భాగంగా కాకాణి గోవర్ధన్​రెడ్డిని పోలీసులు 54 ప్రశ్నలు అడిగారు. పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు కాకాణి సరైన సమాధానం ఇవ్వలేదని సమాచారం. మరి కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేసినట్లు తెలిసింది. అంతకు ముందు ఈ కేసు విచారణకు కాకాణి మందీమార్బలంతో ర్యాలీగా వచ్చారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు అడ్డుపెట్టి ర్యాలీని అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అయణ్ని ఒక్కరినే పోలీస్​ స్టేషన్‌ వద్దకు అనుమతించారు.

మంత్రి కాకాణిని కాపాడటం కోసం లొసుగులతో దర్యాప్తు! - సీబీఐ తీరుపై వ్యక్తమవుతున్న అనుమానాలు

ABOUT THE AUTHOR

...view details